Site icon NTV Telugu

Allu Arjun: చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ అయిపోయారు.. మరి అల్లు అర్జున్ రిస్క్ చేస్తాడా?

Allu Arjun Bollywood Debut

Allu Arjun Bollywood Debut

Will Allu Arjun tried his luck in Bollywood: టాలీవుడ్ సీనియర్ హీరోల సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం స్టార్ లిస్ట్‌లో ఉన్న హీరోలు ఒక్కొక్కరుగా బాలీవుడ్‌లో లక్ చెక్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ పాన్ ఇండియా టాలీవుడ్ హీరోలలో ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ టాప్‌ ప్లేస్‌లో ఉన్నారు. వీళ్లలో ఇప్పటికే చరణ్, ప్రభాస్ బాలీవుడ్ సినిమాలు చేసేశారు. పుష్కర కాలం క్రితమే రామ్ చరణ్ బాలీవుడ్‌లో ‘జంజీర్’ అనే సినిమా చేశాడు కానీ.. ఆ సినిమా దెబ్బకు మరోసారి బాలీవుడ్ వైపు చూడలేదు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో మాత్రం పాన్ ఇండియా లెవల్లో మెప్పించడంతో పాటు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ మరోసారి హిందీ సినిమా చేస్తాడనే గ్యారెంటీ లేదు.

బాహుబలితో ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా నిలిచిన ప్రభాస్.. ఆదిపురుష్‌తో బాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ చేశాడు. ఇక ఈ సినిమా రిజల్ట్ గురించి అందరికీ తెలిసిందే. గ్రాఫిక్స్ పరంగా ఏదైనా సినిమాను కంపారిజన్ చేయాలంటే.. ముందుగా ఆదిపురుష్‌తో ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు. కాబట్టి మరోసారి ప్రభాస్ బాలీవుడ్ వైపు చూసే అవకాశాలు తక్కువ. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ‘వార్ 2’ మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు కాబట్టి.. ఇది మల్టీస్టారర్‌ లిస్ట్‌లోకి వెళ్లిపోతుంది. ఈ సినిమాకు టాక్ బాగానే ఉన్నప్పటికీ.. ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో మరో సినిమా చేస్తాడనే రేంజ్‌లో అయితే లేదు.

Also Read: Nagarjuna Akkineni: నాగ్ సర్.. ఇక ఆపేస్తే బెటర్!

ఇక నెక్స్ట్ బాలీవుడ్‌కి వెళ్లే లిస్ట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నాడు. పుష్ప, పుష్ప 2 సినిమాలతో బాలీవుడ్‌ని షేక్ చేసిన బన్నీ.. సంజయ్ లీలా భన్సాలీ లాంటి డైరెక్టర్‌తో సినిమా చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్‌ బాలీవుడ్ డెబ్యూ చూసిన తర్వాత.. బన్నీ రిస్క్ చేస్తాడా? అంటే డౌటే అని చెప్పాలి. ప్రస్తుతం అట్లీతో బన్నీ సినిమా చేస్తున్నాడు. చివరగా అట్లీ తీసిన జవాన్, బన్నీ చేసిన పుష్ప 2 హిట్ అయ్యాయి. దాంతో బన్నీ-అట్లీ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version