Allu Arjun : బన్నీ-అట్లీ సినిమాకు ఇంటర్నేషనల్ టచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నేషనల్ వైడ్ ఫేమ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప 2’ తర్వాత ఆయన తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ బాక్సాఫీస్ డైరెక్టర్ అట్లీ తో కలిసి చేస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఈ సినిమా గురించి తాజాగా వినిపిస్తున్న ఒక హాట్ అండ్ క్రేజీ అప్‌డేట్ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచుతోంది. సమాచారం ప్రకారం, అట్లీ ఈ సినిమా కోసం ఒక అసాధారణమైన ‘అండర్ వాటర్’ (నీటి అడుగున) యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట. ఈ ఇంట్రెస్టింగ్ ఘట్టంలో అల్లు అర్జున్ పాల్గొంటున్నారని, దీని షూటింగ్‌ను గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
ఈ సీక్వెన్స్‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా, మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా, భారీ బడ్జెట్‌ను కేటాయించారట. ముఖ్యంగా, ఈ క్లిష్టమైన అండర్ వాటర్ విజువల్స్ కోసం హాలీవుడ్ నుంచి ప్రత్యేక టెక్నీషియన్లను రప్పించి, వారి పర్యవేక్షణలో షూటింగ్ జరుగుతుంది. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచేలా, థియేటర్లలో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చేలా అట్లీ తీర్చిదిద్దుతున్నారని టాక్. ఇది వరకు రిలీజ్ చేసిన పోస్టర్లలో కూడా నీటి ప్రవాహం లాంటి విజువల్స్‌ని చూపించడంతో, ఈ అండర్ వాటర్ ఎపిసోడ్ కథలో కీలకమైన ఎమోషనల్ లేదా యాక్షన్ పాయింట్‌తో ముడిపడి ఉండవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ అందించే సంగీతం ఈ సినిమా విజువల్ గ్రాండియర్‌కి మరింత బలాన్ని ఇవ్వనుంది. పాన్-ఇండియా లెవెల్‌లో అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగ్గట్టుగా, విజువల్ ట్రీట్‌గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Also Read
- Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Lala Amarnath: భారత్‌కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
తాజావార్తలు
-
Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
-
Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
-
BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!