NTV Telugu Site icon

Allu Arjun Arrest Live Updates: హీరో అల్లు అర్జున్‌ జైలు నుంచి విడుదల.. లైవ్ అప్‌డేట్స్!

Alli Arjun

Alli Arjun

‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.. జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే కాసేపు అల్లు అర్జున్ వున్నారు. అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీసు నుంచి నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ ను చూసిన కుటుంబ సభ్యులు బావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసిన అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నేను చట్టాని గౌరవిస్తాను అన్నారు. నేను బాగానే వున్నానని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని, కోర్టులో కేసు ఉంది ఇప్పుడు నేను ఏం మాట్లాడలేను అన్నారు. శుక్రవారం రోజు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు.. ‘పుష్ప 2’ బెనిఫిట్‌ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో బన్నీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే..