ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే ఆయన టీమ్ ఒక 42 నిబంధనలతో కూడిన జాబితాను (Rules List) ఇస్తుందని సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా చేసిన ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ అభిమానుల్లో సినీ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే, ఈ ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో ఇప్పుడు ఈ వివాదం ఒక కీలక మలుపు తీరిగింది.
Also Read : The Paradise : నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ది ప్యారడైజ్’ నుండి క్రేజీ అప్డేట్..
ఈ వివాదానికి కారణమైన కావేరి బరువా తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బహిరంగ క్షమాపణలు చెప్పారు. వాస్తవాలను సరిచూసుకోకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా తాను ఆ వ్యాఖ్యలు చేశానని ఆమె అంగీకరించారు.. ‘నాకు అల్లు అర్జున్ లేదా ఆయన టీమ్ నుండి ఎలాంటి ’42 డూస్ అండ్ డోంట్స్’ లిస్ట్ అందలేదు, పొరపాటున ఆ మాటలు అన్నాను’ అని స్పష్టం చేస్తూ, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
మరోవైపు, ఈ ఇంటర్వ్యూను ప్రసారం చేసిన పాడ్‌కాస్టర్ స్వీకృతి కూడా స్పందిస్తూ.. ఆరోపణల్లో నిజానిజాలు తెలుసుకోకుండా వీడియోను పోస్ట్ చేసినందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆ వివాదాస్పద పాడ్‌కాస్ట్ వీడియో రీల్స్‌ను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నుండి తొలగించినట్లు ఆమె వెల్లడించారు. అంతేకాకుండా, ఈ విషయంలో తమ టీమ్ సభ్యులను వేధించడం ఆపాలని ఆమె నెటిజన్లను కోరారు. అల్లు అర్జున్ టీమ్ కూడా ఇలాంటి జాబితా ఏదీ లేదని ఇది వరకే క్లారిటీ ఇవ్వడంతో, ఈ వివాదానికి ఇప్పుడు పూర్తిస్థాయిలో ముగింపు పడినట్లయింది.