ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం.. న్యూయర్ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఎప్పుడెప్పుడు కొత్త ఏడాదిలోకి అడుగు పెడదామా అని కోటి ఆశలతో వెయిట్ చేస్తున్నారు.. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎన్టీఆర్ తో పాటు పలువురు సెలబ్రిటీలందరూ కూడా వెకేషన్ వెళ్లారు.
అక్కడ వారంతా ఘనంగా విదేశాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి భారీగా ప్లాన్ చేశారని తెలుస్తుంది.. మొన్న ఎన్టీఆర్ కూడా విదేశాలకు వెళ్లాడు.. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఇలా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నా కూడా సినిమాలకు కాస్త విరామం ప్రకటించి తన కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్లారని తెలుస్తుంది. ఇకపోతే అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే..
తన పిల్లల ఫోటోలను షేర్ చేసుకుంటూ వస్తుంది.. తాజాగా వేకేషన్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. తన ఇద్దరు పిల్లలతో కలిసి సముద్ర తీరాన సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ వీడియోలలో తన కొడుకుతో పాటు కూతురు కూడా ఎంతో సంతోషంగా కనిపించారు. అలాగే ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా అల్లు స్నేహారెడ్డి మరికొన్ని ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.. అందులో అర్హ, అయాన్లు ఆటోలో వీధులు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు..