NTV Telugu Site icon

World Cup 2023: వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్, ఫైనల్కు ఐసీసీ రిజర్వ్ డే కేటాయింపు

Resrve Day

Resrve Day

స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ చివరి దశకి చేరుకుంది. రేపు, ఎల్లుండి సెమీఫైనల్ మ్యాచ్ లు జరుగనుండగా… ఈ నెల 19వ తేదీన జరిగే ఫైనల్ జరుగనుంది. దీంతో ఈ మెగా టోర్నీ సమాప్తమవుతుంది. అయితే.. సెమీస్, ఫైనల్ మ్యాచ్ ల కోసం ఐసీసీ రిజర్వ్ డేలను కేటాయించింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డేలో నిర్వహించనున్నారు. ఏదైనా వాతావరణ ఇబ్బందులతో కనీసం 20 ఓవర్ల చొప్పున కూడా జరపలేని పరిస్థితుల్లో మ్యాచ్ ను రిజర్వ్ డేకి మళ్లిస్తారు.

Read Also: Kane Williamson: టీమిండియాతో సెమీస్ మ్యాచ్.. కీలక వ్యాఖ్యలు చేసిన కివీస్ సారథి

ఇదిలా ఉంటే.. రేపు వాంఖడే స్టేడియంలో జరుగబోయే టీమిండియా, న్యూజిలాండ్ తొలి సెమీస్ కు ఎలాంటి వర్ష సూచన లేదు. ముంబైలో రేపు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం పడేందుకు కేవలం 3 శాతం అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఇక.. ఎల్లుండి కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఆ మ్యాచ్ కు వర్షం పడే అవకాశాలు పగటి పూట 54 శాతం, రాత్రి వేళ 75 శాతం ఉన్నాయి.

Read Also: Israel-Hamas War: గాజా ఆస్పత్రుల కిందే హమాస్ నెట్‌వర్క్.. బందీలు కూడా అక్కడే..

ఇక ఫైనల్ మ్యాచ్ కు వాన ముప్పు ఏమాత్రం లేదని వాతావరణ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ రోజున వర్షం పడే అవకాశాలు కేవలం 0-1 శాతం మాత్రమే ఉన్నాయి. ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇక, వర్షం వల్ల రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ జరిపేందుకు వీలు కాకపోతే… పాయింట్ల పట్టికలో స్థానాల ఆధారంగా నిర్ణయించుతారు. దీంతో తొలి సెమీస్ నుంచి టీమిండియా, రెండో సెమీస్ నుంచి దక్షిణాఫ్రికా ఫైనల్ కు చేరుకుంటాయి. ఇక.. ఫైనల్ లో కూడా పూర్తిగా రిజర్వ్ డేతో సహా వర్షార్పణం అయితే లీగ్స్ లో అన్ని మ్యాచ్ ల్లో గెలిచిన టీమిండియానే విజేతగా నిలుస్తుంది.

Show comments