Site icon NTV Telugu

AP Ministers Chambers: మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు.. డిప్యూటీ సీఎం పవన్‌కు ఎక్కడంటే..?

Ap Secretariate

Ap Secretariate

AP Ministers Chambers: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.. అప్పటికే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారం, శాఖల కేటాయింపు.. బాధ్యతల స్వీకరణ అంతా జరిగిపోయింది.. అయితే, కొందరు మంత్రులు అప్పటికే తమకు కేటాయించిన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.. మరికొందరు సంబంధిత శాఖల కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టారు. అయితే, ఇప్పుడు మరికొందరు మంత్రులకు రాష్ట్ర సచివాలయంలో ఛాంబర్లు కేటాయిస్తూ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి బ్లాక్‌లో సీఎం చంద్రబాబు కొనసాగుతోన్న విషయం విదితమే కాగా.. గతంలో ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్, పేషీని ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు కేటాయించారు. మంత్రి పయ్యావులకు గతంలో కేఈ వినియోగించిన పేషీ, ఛాంబర్ కేటాయించగా.. మంత్రులకు కేటాయించిన ఛాంబర్లు, పేషీల నంబర్లతో జీవో జారీ చేసింది జీఏడీ.

Read Also: Minister Satya Kumar Yadav: సీఎం చంద్రబాబుకు ఇంకా సమయం ఇవ్వాలి…

ఇక, మంత్రులు నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర , నాదెండ్ల మనోహర్‌, పి. నారాయణ, వి. అనిత, సత్యకుమార్‌ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఫరూక్, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్య ప్రసాద్, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్‌, సంధ్యారాణి, బీసీ జనార్ధన్‌, టీజీ భరత్, సవిత, సుబాష్‌, శ్రీనివాస్, రాంప్రసాద్‌రెడ్డి.. ఇలా మంత్రులకు కేటాయించిన ఛాంబర్లు.. కింద జీవోలో చూడొచ్చు..

 

 

 

Exit mobile version