Allola Indrakaran Reddy : అభివృద్ధి, సంక్షేమ పథకాలే విజయానికి సోపానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లిలో దుర్గమాత మండపం, అంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుటుంబ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. స్వంత గ్రామం నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రచార రథం ఎక్కి మంత్రి ఎన్నికల రంగంలోకి దిగారు. అంతకుముందు కుమ్రం భీం, డా. బీఆర్. అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ… సీయం కేసీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి సోపానాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్ల గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్ళుతున్నామని, రాష్రంలో అందుతున్న ప్రభుత్వ సపంక్షేమ ఫథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష అని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న పనులను వివరించి భవిష్యత్తులో మరింత అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని ప్రజల ముందుకు వెళ్ళుతున్నామని అన్నారు. ఈ తొమ్మదిన్నర ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, బీఆర్ఎస్ మేనిపెస్టో ను వివరిస్తూ ఓట్లు అడుగుతామని వివరించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి తోడ్పడే విధంగా మేనిపెస్టో ఉందని, బీఆర్ఎస్ పార్టీ హ్యట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
గతంలో ఎన్నడూలేని విధంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించగలిగామని, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి. షాదీముబారక్ లాంటి పథకాల ద్వారా వేలాదిమంది లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కండ్ల ముందే కనబడుతున్నదని, అభివృద్ధి ఫలాలు పొందుతున్న.. నిర్మల్ ప్రజలు మరోసారి ఆశీర్వాదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వారందరి ఆశీర్వాదంతో మూడోసారి ఎమ్మెల్యేగా హ్యట్రిక్ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!