జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌరస్తాలో బండి సంజయ్ దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. ఈ కార్యక్రమంలో.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతకుముందు టెన్త్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించారు. పేపర్స్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడిందన్నారు. పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ నిందితుడితో బండి సంజయ్ సహా బీజేపీ నేతలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ లో ఇదంతా జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్రం కక్ష్య గట్టిందని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో అలజడి సృష్టించాలని చూస్తోందన్నారు. పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంపై కక్ష్య గట్టిన కేంద్రం ప్రభుత్వమని, తెలంగాణ ప్రభుత్వన్ని బదనాం చేయాలని చూస్తోందన్నారు.
Also Read : Shweta Basu Prasad: ‘కొత్త బంగారు లోకం బ్యూటీ’ ఎద అందాల ప్రదర్శన..అదిరింది
గతంలో ఎన్నడూ కూడా తెలంగాణలో ఈ విధంగా పేపర్ లీకేజీలు ఘటనలు జరగలేదు. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో తెలంగాణలో ఏదో ఒక అలజడి సృష్టించి, రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి చూస్తుంది బిజెపి చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతలు తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ , నిన్న పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుల కుట్ర కోణంపై నిష్పక్షపాత దర్యాఫ్తు కొనసాగుతోంది. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని, బీజేపీ నేతలు తీరును నిరసిస్తూ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నామన్నారు ఇంద్రకరణ్ రెడ్డి.