NTV Telugu Site icon

Maheshwar Reddy : కార్పొరేట్ హాస్పిటల్స్‌ను సీఎం రేవంత్‌ ప్రోత్సహిస్తున్నాడు

Maheshwar Reddy

Maheshwar Reddy

తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టారని, కార్పొరేట్ హాస్పిటల్ లను ప్రోత్సహిస్తున్నాడని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ హాస్పిటల్ లోకి మీడియా ను కూడా అనుమతి ఇవ్వడం లేదు… ఇదేనా మీ ప్రజా పాలన అని ఆయన ప్రశ్నించారు. గ్రూప్స్ నోటిఫికేషన్‌ల తేదీలను మీ మేనిఫెస్టో లో పెట్టీ అమలు చేయడం లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే చావు డప్పు కొట్టాలని రేవంత్ రెడ్డి అన్నారని, ఇప్పుడు మీరు చేర్చుకున్న ఎమ్మెల్యేల ఇల్ల ముందు ఏ డప్పులు కొట్టాలని మహేశ్వర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏ విధంగా కండువాలు కప్పుతున్నారని, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్ బి ఫార్మ్ మీద పోటీ చేయించినప్పుడే ప్రజా స్వామ్యాని కూని చేశారన్నారు.

అనర్హత పిటిషన్ ఇవ్వాలని వారం రోజుల నుండి ప్రయత్నించిన స్పీకర్ టైమ్ ఇవ్వడం లేదని, సాక్ష్యాధారాలతో పార్టీ మారినట్టు ఋజువు లు ఉన్నపటికీ చర్యలు తీసుకోలేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఉందని, అసెంబ్లీ సాక్షిగా రిజిస్టర్ పోస్ట్, ఈ మెయిల్, ఆఫీస్ లో అనర్హత పిటిషన్ లు ఇస్తున్నామన్నారు. దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ స్పీకర్ కు ఇస్తున్నామని, రాష్ర్ట ప్రభుత్వం పై ఇప్పటి వరకు 6 అవినీతి ఆరోపణలు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. సివిల్ సప్లై శాఖలో అవినీతి నీ ఆధారాలతో సహా బయట పెట్టబోతున్నామని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

Show comments