Site icon NTV Telugu

Alleti Maheshwar Reddy : సీఎం అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారు

Mla Maheshwar Reddy

Mla Maheshwar Reddy

సీఎం అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష గొంతు వింటే ఎందుకు భయపడుతున్నారని ఆయన అన్నారు. తప్పించుకునేందుకే నాలుగు రోజులు అసెంబ్లీ రన్ చేస్తారని, డిమాండ్స్ పై మూడు రోజులు మాత్రమే డిస్క్యుషన్ పెట్టారన్నారు. 31 లోపు అప్రప్రేషన్ బిల్లు కావాలంటే బడ్జెట్ ముందు పెట్టాలని తెలీదా? అని ఆయన ప్రశ్నించారు. బీఅర్ఎస్ మాదిరిగానే మూడు నాలుగు రోజులు బడ్జెట్ సెషన్ పెట్టడం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. మేము 18 అంశాలు వారి దృష్టికి తీసుకెళ్లామని, అందులో ఒక్కటి రెండు అంశాలే చర్చకు వచ్చే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

వ్యవసాయం , ఇరిగేషన్ , సాగు. నీరు , ఉద్యోగాల ఖాళీలు , భర్తీ , మహిళల హామీ మీద , విద్య రంగ సమస్యలు , పంచాయతీ రాజ్ శాఖ సమస్యలు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే హామీల మీద , పౌర సరఫరాల శాఖ మీద జరిగే అక్రమాల మీద , గృహ నిర్మాణ శాఖ , పెన్షన్లు , రెవిన్యూ శాఖ అవినీతీ …. ఇలా 18 రోజులు రోజుకి ఒక్క అంశం మీద చర్చ పెట్టాలని డిమాండ్ చేశామని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వం అవినీతి పునాదుల మీద నడుస్తోందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్యుల కలను సహకారం చేసేలా ఉందని, పేదల సంక్షేమానికి పెద్ద వేసేలా ఉందని, ఇది విసినరీ బడ్జెట్ అని, యువతకు పెద్ద పీట వేసే బడ్జెట్ అని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version