Allahabad Central University : అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని పీసీబీ హాస్టల్‌లోని రూమ్ నంబర్ 68లో బాంబు పేలింది. బాంబు పేలుడు కారణంగా ప్రభాత్ అనే విద్యార్థి గాయపడ్డాడు. అతని ఒక చేయి నుజ్జునుజ్జు అయిపోయింది. ఛాతీలోకి బాంబు శకలాలు దూసుకుపోయాయి. విద్యార్థి ఈ పీసీబీ గదిని ఆక్రమించుకుని అక్రమంగా ఉంటున్నాడు. సంఘటనా స్థలానికి కల్నల్‌గంజ్ పోలీస్ స్టేషన్ చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఎస్‌ఆర్‌ఎన్ ఆస్పత్రిలో చేర్పించారు. బాంబు పేలుడు అనంతరం అక్కడ కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థిని.. సహచర విద్యార్థులు సాయంతో ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో పోలీసులు నిమగ్నమయ్యారు. పిసి బెనర్జీ హాస్టల్‌లో నివసిస్తున్న ఒక విద్యార్థి బుధవారం బాంబు తయారు చేస్తున్నప్పుడు పేలుడు కారణంగా అతని కుడి చేతికి తీవ్రంగా గాయమైంది.
Read Also:Bigg Boss 7 Grand Finale : బిగ్ బాస్ ఫినాలే కు ఇద్దరు స్టార్ హీరోలు.. విన్నర్ ఎవరంటే?
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రిలో చేర్చారు. అలహాబాద్ యూనివర్శిటీలో ఎంఏ చదువుతున్న ప్రభాత్ యాదవ్ పీసీ బెనర్జీ హాస్టల్‌లో నివసిస్తున్నాడని, ఈరోజు సాయంత్రం బాంబు తయారు చేస్తున్నాడని ఆ సమయంలో అది పేలిందని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజేష్ కుమార్ యాదవ్ తెలిపారు. విద్యార్థిని ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పారు. ఈ ఘటనలో మరో విద్యార్థికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా ప్రభాత్ యాదవ్‌పై సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేస్తామన్నారు. అయితే ఈ విషయమై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. అలహాబాద్ యూనివర్సిటీలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. హాస్టల్‌లో అనేక విద్యార్థి సంఘాలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
Read Also:Gold Price Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..ఈరోజు ఎంతంటే?