Site icon NTV Telugu

Bhuma Akhila Priya: ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మంచి మనసు.. ఐదు నెలల జీతం విరాళం!

Bhuma Akhila Priya

Bhuma Akhila Priya

మన దేశ సైనికులకు సంఘీభావంగా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నేతృత్వంలో తిరంగా ర్యాలీ జరిగింది. ఈ సందర్బంగా పాకిస్తాన్ యుద్ధంలో అమరవీరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్‌కు అఖిల ప్రియ నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కొవ్వొత్తులతో ఎమ్మెల్యే ర్యాలీ నిర్వహించారు. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు తిరంగా ర్యాలీ పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత జాతీయ జెండాను పట్టుకున్నానని ఎమ్మెల్యే చెప్పారు. ఎమ్మెల్యే అఖిల ప్రియ తన ఐదు నెలల జీతాన్ని ఆర్మీకి విరాళంగా ప్రకటించారు. ఎమ్మెల్యే మంచి మనసును అందరూ ప్రశంసిస్తున్నారు.

Also Read: Top Headlines @ 9PM : టాప్‌ న్యూస్‌!

ఇక ఆళ్లగడ్డలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో ఎమ్మెల్యే అఖిల ప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్కులను చేసుకొని 60 శాతం, 40 శాతం కమిషన్లు తీసుకుందామంటూ వైసీపీ నాయకులు రాయబారం పంపారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈరోజు గెలిచామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో లాగా కాకుండా.. ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాం అని హామీ ఇచ్చారు. ఈ గెలుపు తనది కాదని, ప్రజల గెలుపు అని ఎమ్మెల్యే అఖిల ప్రియ చెప్పుకొచ్చారు.

Exit mobile version