Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో కలిసి కేక్ కట్ చేసి లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో 299 మంది లబ్ధిదారులకు రూ.38 లక్షలు పీఎం స్వ నిధి చెక్కు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదని, ఎన్డీఏ ప్రభత్వం ఎప్పుడూ ప్రజల సమస్యలు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
READ ALSO: Google Internship 2026: గూగుల్‌లో ఇంటర్న్‌షిప్ చేసే గోల్డెన్ ఛాన్స్.. స్టైఫండ్ ఎంతో తెలుసా!
అనంతరం ఆళ్లగడ్డలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ జాబ్ మేళాలో సెలక్ట్ అయిన వారిని ఎమ్మెల్యే అభినందించారు. ఆమె మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో తన మీద కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, రాజకీయాలంటేనే విరక్తి కలిగిన సమయంలో నారా లోకేష్ ధైర్యం ఇచ్చారని, అమ్మ, నాన్న చనిపోయినప్పటి నుంచి తనకు చంద్రబాబు అండగా నిలబడ్డారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ యువతకు 5000 ఉద్యోగాలు ఇప్పిస్తానని మాట ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం ఆళ్లగడ్డలో నిరుద్యోగ యువతీ యువకులు ఎవరు లేకుండా చూసుకుంటానని చెప్పారు. మంత్రి నారా లోకేష్ అండతో ఆళ్లగడ్డను ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తానని, నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా జాబ్ మేళా నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు.
READ ALSO: Rakasa Glimpse: ‘ఆ వీరుడిని నేనే’.. అంటున్న సంగీత్ శోభన్! అసలు మ్యాటర్ ఇదే..
