NTV Telugu Site icon

Raj Tarun : ఎవరి ఆరోపణల్లో నిజమెంత…?

Raj Tarun Case

Raj Tarun Case

పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు పొంది పలువురు దర్శక – నిర్మాతల దృష్టిని ఆకర్షించి ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు రాజ్‌తరుణ్. అలా మొదటి చిత్రం విరించి వర్మ దర్శకత్వంలో అన్నపూర్ణ , సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘ఉయ్యాలా జంపాల’ చిత్రం ద్వారా హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టి, వరుస అవకాశాలను అందిపుచ్చుకొని ఫుల్ బిజీ హీరో అయ్యాడు రాజ్‌తరుణ్.

ఒక హిట్‌ రెండు ప్లాప్ లు అన్నట్టు సాగుతోంది కుర్ర హీరో సినీ కెరీర్. ఈ తరుణంలో ఈ హీరోపై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసారు. రాజ్‌తరుణ్ సినిమా అవకాశాలకు కోసం హైదరాబాద్ కి వచ్చిన రోజుల్లో తాను ఆశ్రయం కల్పించాను, ఆర్ధికంగా రాజ్‌తరుణ్ కు ఎంతో సాయం చేశాను, నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే నమ్మాను, కానీ ఇప్పుడు హీరోగా గుర్తింపు దక్కించుకొన్నాక ఓ హీరోయిన్ తో సంబంధం పెట్టుకొని తనను దూరం పెట్టాడు. చివరికి నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడని లావణ్య నార్సింగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

కాగా యంగ్ హీరో వాదన మరోలా ఉంది. లావణ్య తనకు వైజాగ్‌లో ఉంటుండగా ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయింది, సినిమా ఛాన్స్‌ల కోసం పరిశ్రమకు వచ్చిన రోజుల్లో సహాయం చేసింది, అంతే తప్ప ఆమెతో నాకు ఎటువంటి ఫిజికల్ రేలషన్ లేదు. లావణ్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని విడిపోయి తిరిగి ఆ వ్యక్తిపైనే గుంటూరు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. దానికి సంబందించిన FIR కాపీ తన వద్ద ఉంది. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉంది, వద్దని వారించినందుకు తనతో గొడవపడింది, గతంలో ఓ సారి డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయిందని అన్నాడు. లావణ్యపై తానూ లీగల్ పోరాటానికి వెళతానని రాజ్ తరుణ్ వెల్లడించారు

ఒకరిపై ఒకరి ఆరోపణలతో ఓ చిన్నపాటి సినిమా స్టోరీని తలపిస్తున్న లావణ్య – రాజ్‌తరుణ్‌ల వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఎవరి మాటల్లో ఎంత నిజముందో రానున్న రోజుల్లో తేలనుంది.

 

Show comments