MLC Elections: ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలీంగ్ జరగనుంది. దీనికి సంబంధించి వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభ ప్రాంగణంలో పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగబోతోంది. ఉన్నది ఏడు స్థానాలు. కానీ బరిలో నిలిచింది 8మంది. ఒకవైపు ఏడుగురు, మరోవైపు ఒకే ఒక్కరు. శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175. ఇందులో వైఎస్సార్‌సీపీకి 151 మంది సభ్యులు ఉండగా.. టీడీపీకి అధికారికంగా 23 మంది, జనసేనకు ఒకరు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీకి 19 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. అలాగే జనసేనకు ఉన్న ఒక సభ్యుడు కూడా ఆ పార్టీకి దూరమయ్యారు. ఒక్కో ఎమ్మెల్సీ గెలుపొందడానికి 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్న నేపథ్యంలో ఏడు స్థానాలకు అభ్యర్థులను బరిలో దించింది. ఈ క్రమంలో వాస్తవంగా చూస్తే.. ఒక్క స్థానం గెలవడానికి కూడా టీడీపీకి బలం లేదు.
Read Also: KCR Tour: నేడు 4 జిల్లాల్లో కేసీఆర్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదీ
అసెంబ్లీలో బలాబలాలను చూస్తే వైసీపీ బలం 156కి చేరింది. కానీ ఇటీవలే తిరుగుబాటు జెండా ఎగరేసిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి విషయంలో కాస్త టెన్షన్ నెలకొంది. సో .. వైసీపీ తన బలాన్ని 154గానే తీసుకోవాలి. వీళ్లను 7 టీమ్‌లుగా విభజించి.. ఒక్కో టీమ్‌కు ఒక్కో లీడర్‌ను పెట్టారు. ప్రస్తుతం ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే కచ్చితంగా 22 ఓట్లు కావాలి. అంటే ఈ 154 మందిలో ఒక్క ఓటు కూడా నష్టపోకూడదు. వైఎస్సార్‌సీపీలో పనితీరు ఆధారంగా కొంతమంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కే అవకాశం లేదని అంచనా. ఈ నేపథ్యంలో అలాంటి వారి మద్దతు కోసం టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. అసెంబ్లీలోని కమిటీ హాల్ నంబర్ –1లో తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తుంది. అనంతరం ఐదు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. తదుపరి ఫలితాలు ప్రకటిస్తారు.
Read Also: Chandrababu: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ.. విషయం ఇదే..