Site icon NTV Telugu

All-Party Meeting : నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

All Party Meeting

All Party Meeting

All-Party Meeting : కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఎందుకంటే సౌత్ లోని అన్ని రాష్ట్రాలు గతంలో జనాభాను నియంత్రించాయని.. ఉత్తర భారత రాష్ట్రాలు నియంత్రించలేదు కాబట్టి.. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉందని రేవంత్ ఇప్పటికే వివరించారు. ఈ లెక్కన జనాభా ఎక్కువ ఉన్న నార్త్ రాష్ట్రాలకే ఎక్కువ సీట్లు వస్తాయని.. పార్లమెంట్ లో దక్షిణ రాష్ట్రాల వాయిస్ తగ్గిపోతుందంటూ చెప్పారు.

Read Also : Suvendu Adhikari: బీజేపీ గెలిచిన తర్వాత ముస్లిం ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తాం..

తాజాగా ఈ విధానంపై మరో ముందడుగు వేస్తోంది ప్రభుత్వం. ఈ నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణలోని అన్ని పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు రావాలంటూ ఆహ్వానించారు. రాజకీయాలకు అతీతంగా దీన్ని చూడాలని.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై అందరూ మాట్లాడాలని వారు లేఖలో కోరారు. త్వరలోనే అఖిలపక్ష భేటీ తేదీని, వేదికను ప్రకటిస్తామన్నారు.

Read Also : Holi: సంభాల్ జామా మసీదులో పాటు 10 మసీదులకు ముసుగు..

Exit mobile version