NTV Telugu Site icon

Delhi: బడ్జెట్ సెషన్‌పై ఆల్‌పార్టీ మీటింగ్.. ఏం చర్చించారంటే..!

Budjet

Budjet

ఢిల్లీ: బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక గురువారం (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై ప్రజలు, ఉద్యోగులు, అన్నదాతలు, రాష్ట్ర ప్రభుత్వాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి ఏమైనా వరాలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తు్న్నారు. ఇక బడ్జెట్ మర్మమేంటో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Tirupati: హీరో ధనుష్ సినిమా షూటింగ్ పై తిరుపతి పోలీసులు కీలక నిర్ణయం..

ఇదిలా ఉంటే రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో 30 పార్టీలకు చెందిన 45 మంది పార్టీల ఫ్లోర్‌లీడర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రతి అంశాన్ని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రులు ఆల్‌పార్టీల నేతలకు తెలియజేశారు. సహృదయంతో పార్టీలన్నీ సహకరించాలని కోరారు.

Mohan Babu: ఇళయరాజాను పరామర్శించిన మోహన్ బాబు..

ఇదిలా ఉంటే విపక్షపార్టీలు కూడా లోక్‌సభలో ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పైగా ఇవే చివరి పార్లమెంట్ సమావేశాలు.. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై కేంద్రాన్ని ఇరుకునపెట్టేందుకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. చివరి సమావేశాలు కాబట్టి హాట్ హాట్‌గా జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా ఫిబ్రవరి 9 వరకే ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార-ప్రతిపక్ష పార్టీల్లో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.