NTV Telugu Site icon

All India Builders Convention: హైటెక్స్ వేదికగా ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్..

Buliders

Buliders

హైటెక్స్ వేదికగా ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మరోవైపు.. దేశ వ్యాప్తంగా ఉన్న బిల్డర్స్ కన్వెన్షన్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం హడావుడిగా కట్టింది అని.. అందుకే మూడు డ్యాంలకు ముప్పు ముంచి ఉందని అన్నారు. డ్రాయింగ్స్ ఎవరు అప్రూవ్ చేసినా… తప్పులు ఉంటే చెప్పాల్సిన బాధ్యత ఏజెన్సీలపై ఉందని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా పాత అగ్రిమెంట్ లే కొనసాగుతున్నాయని అన్నారు. ధనిక తెలంగాణను పేద తెలంగాణను చేసి వెళ్ళింది పాత ప్రభుత్వమని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు ఇబ్బందులు లేకుండా చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Read Also: Akhilesh Yadav: లోక్‌సభ సీట్లు ప్రకటించేసిన అఖిలేష్.. కాంగ్రెస్ గరం గరం!

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్ హైదరాబాద్ లో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును సక్సెస్ ఫుల్ గా చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు విషయంలో విఫలం అయింది.. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డి తాను కాంట్రాక్టర్ అని చెప్పారు కానీ.. తాను కాంట్రాక్టర్ కానన్నారు. తనకు నల్గొండలో ఇళ్ళు రెంట్ కి ఉంది.. హైదరాబాద్ లో ఒక చిన్న ఇళ్ళు ఉందని పేర్కొన్నారు. తాను ఐతే కాంట్రాక్టర్ బిసినెస్ చేయనన్నారు.

Read Also: Vishwambhara: షూట్ కూడా మొదలుకాలేదు.. భారీ రేటుకు విశ్వంభర రేట్స్ అమ్మేశారు!

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్లు, బిల్డర్లు ఒక వేదికలో కలుసుకోవడం సంతోషంగా ఉంన్నారు. గత 10ఏళ్లు తెలంగాణలో ఆక్సిస్ లేని ప్రభుత్వం ఉండేదని.. తమ ప్రభుత్వం హైదరాబాద్, తెలంగాణ డెవలప్మెంట్ కు కృషి చేస్తోందని తెలిపారు. మీ ప్రతిపాదనలపై ఆలోచన చేస్తాము.. తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.