NTV Telugu Site icon

Alien Birth: బీహార్లో వింత శిశువు జననం.. చూసేందుకు ఎగబడుతున్న జనం

Infant

Infant

Alien Birth: బీహార్ మోతిహరిలో విచిత్రం చోటు చేసుకుంది. పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేరిన గర్భిణి ముక్కులేని వింత శిశువుకు జన్మ నిచ్చింది. మోతిహరి పరిధిలోని అలీషెర్​పుర్​కు చెందిన సరోజ పటేల్ భార్య రూపాదేవి పురిటి నొప్పులతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. మూడు రోజుల తర్వాత ఆమెకు ముక్కు లేని మగ శిశువు పుట్టింది. ముక్కు స్థానంలో వింత ఆకారంలో రెండు కళ్లు ఉన్నాయి. శ్వాస తీసుకోవటానికి రంధ్రం కూడా లేకపోవడంతో వైద్యులు అశ్చర్యానికి గురయ్యారు. దీంతో డాక్టర్స్ ఆ శిశువుకు నోటి ద్వారా కృత్రిమంగా ఆక్సిజన్ ను పైపు అమర్చి చికిత్స అందిస్తున్నారు. వింత ఆకారంలో ఉన్న శిశువును చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివస్తున్నారు. ఆ శిశువును చూసి కొంత మంది వినాయకుడు అంటుండగా.. మరికొంతమంది గ్రహాంతరవాసిగా భావిస్తున్నారు. తల్లిదండ్రుల్లో నెలకొన్న జన్యుపరమైన లోపాల కారణంగా, క్రోమోజోమ్​ల లోపాలతో శిశువులు ఇలా పుడతారని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది ఇంకా పాతకాలపు పద్ధతులనే పాటించటం వల్ల కూడా ఇలాంటి లోపాలతో పిల్లలు పుడుతున్నారని వైద్యులు అంటున్నారు.

Read Also: House Fire: చంద్రగ్రహణం తెచ్చిన తంట.. అప్పటినుంచి ఆ ఇంట్లో రోజు మంటలే..

Read Also:Corona Deaths: చైనాలో చిన్నారుల ప్రాణాలు తీస్తున్న లాక్ డౌన్