NTV Telugu Site icon

Alia Bhatt Remuneration: అలియా భట్‌ రెమ్యునరేషన్, ఆస్తుల విలువ ఏంతో తెలుసా?.. ఆల్‌రౌండర్‌గా దూసుకుపోతుందిగా!

Alia Bhatt Remuneration

Alia Bhatt Remuneration

Alia Bhatt Remuneration and Net Worth: బాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో ‘అలియా భట్‌’ ఒకరు. సినిమా నేపథ్యం నుంచి వచ్చిన అలియా.. తన నటనా ప్రతిభతోనే అందరిని ఆకట్టుకున్నారు. 2012లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ తో అరంగేట్రం చేసిన అలియా.. ఒక దశాబ్దం పాటు తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు. నటనతో పాటు వ్యాపారంలో కూడా ఆమె దూసుకుపోతున్నారు. నేడు అలియా భట్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె రెమ్యునరేషన్, నికర ఆస్తుల విలువ గురించి ఓసారి తెలుసుకుందాం.

1993 మార్చి 15న ముంబైలో అలియా భట్‌ జన్మించారు. ఆమె ప్రముఖ దర్శకులు మహేశ్‌ భట్‌-సోనీ రజ్దాన్‌ దంపతుల కుమార్తె. అలియా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా సినిమాల్లో నటించారు. 1999లో అక్షయ్ కుమార్, ప్రీతి జింటాల కాంబోలో వచ్చిన ‘సంఘర్ష్’లో తొలిసారిగా నటించారు. ఈ చిత్రంలో ఆమె ప్రీతి చిన్ననాటి పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో అలియా పాత్ర చిన్నదే అయినా తనదైన ముద్ర వేశారు. పేరెంట్స్ పేరు వాడుకోకుండా స్వతహాగా సినిమాల్లో రావాలనుకున్న అలియా.. సినిమా ఆఫర్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగారు. చివరకు 2012లో కరణ్‌ జోహార్‌ అవకాశం ఇవ్వడంతో హీరోయిన్ అయ్యారు.

12 ఏళ్ల కెరీర్‌లో అలియా భట్‌ ఎన్నో విజయాలు అందుకున్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో ఒకరిగా ఉన్న అలియా.. ఒక్కో చిత్రానికి దాదాపు రూ.10-12 కోట్లు వసూలు చేస్తారట. హాలీవుడ్ మూవీ ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ కోసం $500,000 ఛార్జ్ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. నటనతో పాటు ఆమె నిర్మాత కూడా మారారు. 2021లో ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌ని ప్రారంభించారు. 2022లో ఆమె మొదటి సినిమా ‘డార్లింగ్స్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ‘పోచర్‌’ వెబ్‌సిరీస్‌ ఇటీవల ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో విడుదలైంది.

Also Read: Alia Bhatt Birthday: బాత్‌రూమ్‌లో నిద్ర.. క్లాస్‌లో బెంచీలు తుడిచిన అలియా భట్‌!

అలియా భట్‌ వచ్చే సెప్టెంబర్‌లో ‘జిగ్రా’ను విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్‌తో కలిసి ఆమె నిర్మిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. అలియా మొత్తం నికర ఆస్తుల విలువ రూ.550 కోట్ల కంటే ఎక్కువ. కిడ్ అండ్ మెటర్నిటీ వేర్ బ్రాండ్ ‘ఎడ్-ఎ-మమ్మ’ను అక్టోబర్ 2020లో ఆమె ప్రారంభించారు. 2023లో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీలో 51 శాతం వాటాను కొనుగోలు చేశారు. ఫూల్.కో, స్టైల్ క్రాకర్, సూపర్ బాటమ్స్ వంటి అనేక బ్రాండ్లలో కూడా పెట్టుబడులు పెట్టారు. మొత్తానికి అలియా ఆల్‌రౌండర్‌గా దూసుకుపోతున్నారు. ముంబైలోని బాంద్రాలో సుమారు రూ. 32 కోట్ల విలువైన బంగ్లా, లండన్‌లో రూ.25 కోట్ల విలువైన ఇల్లు కూడా ఉంది. అలియా వద్ద రూ.1.76 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ 7 సిరీస్, రూ.2 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.