Alia Bhatt Jigra : తెలుగులోకి కూడా రాబోతున్న ఆలియా లేటెస్ట్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alia Bhatt Jigra : బాలీవుడ్లో టాలెంటెడ్ స్టార్ హీరోయిన్లలో ఆలియా భట్ ఒకరు. మరి తెలుగులో సెన్సేషనల్ చిత్రం “RRR” తో ఆమె పరిచయం అయింది. అలాగే మరో చిత్రం “గంగూబాయి కతియావాడి” సినిమాతో ఇక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇంకా సోషల్ మీడియాలో కూడా తెలుగు ఆడియెన్స్ కి ఆలియా సుపరిచితురాలే. అయితే ఈమె నటించిన తాజా చిత్రం “జిగ్రా”. ఆలియా భట్ ప్రధాన పాత్రలో వేదాంగ రైనా సినిమలో మేల్ లీడ్ లో నటించాడు. అలాగే దర్శకుడు వాసన్ బాల తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఇన్ని రోజులు కేవలం హిందీ భాషలోనే తీసుకొస్తున్నట్టుగా టాక్ ఉంది. కానీ ఇప్పుడు ఈ చిత్రం హిందీ సహా తెలుగులో కూడా రిలీజ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. తెలుగులో పోస్టర్స్ కూడా బయటకి వచ్చాయి. ఈ సినిమా హిందీ, తెలుగులో కూడా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది.
Read Also:Metro Deluxe Buses: టీజీఎస్ ఆర్టీసీ కొత్తరూల్.. మెట్రో డీలక్స్ బస్సుల్లో స్టాఫ్ నాట్ అలోడ్..
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఆలియా భట్‌కు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. గ్లోబల్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తెలుగులో ఆమె మరింత ఫేమస్ అయింది. ఈ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం.. తెలుగు డబ్బింగ్లోనూ రానుంది. జిగ్రా తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఈ సినిమాను రిలీజ్ చేయనుంది. జిగ్రా తెలుగు పోస్టర్‌ను సెప్టెంబర్ 28 ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో వెల్లడించింది.
Read Also:Khushbu Sundar : ఇతనే నా హీరో.. అతడి మాస్ ను ఎవరు టచ్ చేయలేరు..
జిగ్రాను తెలుగులో నిర్మాతలు సునీల్ నారంగ్, దగ్గుబాటి సురేశ్‌కు చెందిన ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుండడంతో ఈ మూవీపై జనాల్లో క్యూరియాసిటీ పెరిగింది. “ధైర్యం, రక్షణకు సంబంధించిన స్టోరీ ఇది. బిగ్స్క్రీన్లపై చూసేందుకు రెడీగా ఉండండి. జిగ్రా తెలుగు ట్రైలర్ సెప్టెంబర్ 29న వస్తుంది. అక్టోబర్ 11న హిందీ, తెలుగులో జిగ్రా రిలీజ్ కానుంది” అని ఆ సంస్థ పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో ఆలియా భట్, వేద్నాగ్ రైనాతో పాటు ఆదిత్య నంద, శోభితా ధూళిపాళ్ల, మనోజ్ పహ్వా, రాహుల్ రవీంద్రన్ కీలకపాత్రలు పోషించారు. జిగ్రా మూవీకి నిర్మాతల్లోనూ ఒకరిగా ఆలియా భట్ ఉన్నారు. ధర్మ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, ఆలియా భట్, షహీన్ భట్, సౌమెన్ మిశ్రా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రానికి అంచిత్ తక్కర్ సంగీతం అందించగా.. స్వప్నిల్ ఎస్ సోనావానే సినిమాటోగ్రఫీ చేశారు.
A story about courage & protection, ready to unravel on the big screens!👊🏻
Jigra Telugu Theatrical Trailer out tomorrow!#Jigra releasing in Hindi & Telugu – in cinemas 11th October.#KaranJohar @apoorvamehta18 @aliaa08 #ShaheenBhatt @somenmishra0 #VedangRaina @Vasan_Bala pic.twitter.com/jfjpg5MlyN— Asian Suresh Entertainment (@asiansureshent) September 28, 2024
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!