అలసంద పంటను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు.. వర్షాదారంగా సాగయ్యే పంట. వర్షాలు పడటం ఆలస్యమైనప్పుడు నేలలో ఉన్న మిగులు తేమను ఉపయోగించుకుని చాలా మంది అలసంద పంటను సాగు చేస్తుంటారు.. వేడితో కూడిన వాతావరణంలో అలసంద పంట దిగుబడి బాగా వస్తుంది. చలి వాతావరణాన్ని తట్టుకోలేదు. ఈ పంట వేయటానికి ఖరీఫ్, రబీ, వేసవి కాలాలు అనుకూలంగా ఉంటాయి.. ఈ పంటను వెయ్యడానికి జూలై నెల అనుకూలంగా ఉంటుంది..
ఇకపోతే అలసంద కోత విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. అలసందలు పచ్చి కాయలకు, విత్తనం కోసం పండిస్తుంటారు. పచ్చి కాయల కోసం పండించినప్పుడు 45 రోజుల నుండి కాయలు కోతకు సిద్ధంగా వుంటాయి. వచ్చి కాయల నార ఎక్కువగా తయారవక ముందే కోసినచో నాణ్యత కలిగి కూరగాయలుగా ఎక్కువ గిరాకీ ఉంటుంది.. ఈ కాయలను రెండు, మూడు రోజులకు కొయ్యాలి.. సుమారు 40 క్వింటాళ్ళు ప్రతి ఎకరానికి పచ్చి కాయల దిగుబడి వస్తుంది..
ఈ పంటను 80% ఉండగానే కొయ్యడం మంచిదని అప్పుడే కాయలు బాగా ఎండిపోయి నాణ్యత బాగా వస్తుంది.. కోసిన పంటను ౩-4 రోజుల వరకు పంట చేలో గాని లేదా కల్లెంపై ఎండనిచ్చి ఆ తర్వాత కర్రలతో కొట్టిగాని, పశువులతో తొక్కించి లేదా ట్రాక్టర్‌తో తొక్కించి లేదా ఆల్ క్రాప్ త్రెషరను ఉపయోగించి నూర్పిడి చేయాలి. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరచి 2-3 రోజులు బాగా ఎండనిచ్చి గింజలలో తేమ 9 శాతం కన్నా మించకుండా చూసుకొని నిల్వచేయవలెను.. ఇక వీటిని పాలిథీన్ సంచులలో గాని నిల్వ చేయవచ్చును. నిల్వ చేసే ముందు సాధనాలను గోనె సంచులు శుభ్రపర్చుకోవాలి. గోనె సంచులను 10 శాతం వేప ద్రావణం పిచికారి చేసి వాడుకోవాలి.. అప్పుడే పురుగు పడకుండా ఉంటాయని, మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. ఇలా చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది..