Akshay Kumar IPL: కోట్ల రూపాయల ఐపీఎల్ కాంట్రాక్ట్ వదిలేసిన అక్షయ్ కుమార్.. సీజన్, ప్రాంచైజీ ఏదంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshay Kumar saved Delhi Capitals after left Multi-Crore IPL Contract: అనేక దశాబ్దాలుగా బాలీవుడ్ మరియు క్రికెట్ మధ్య మంచి అనుబంధం ఉంది. భారతదేశంలోని ఈ రెండు వినోద వనరులు దేశ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చాక ఈ అనుబంధం మరింత పెరిగింది. ఫ్రాంచైజీ యజమానులుగా బాలీవుడ్ తారలు ఎంట్రీ ఇవ్వడమే అందుకు కారణం. అంతేకాదు లీగ్ ఆరంభంలో ఎందరో హీరో, హీరోయిన్స్ బ్రాండ్ అంబాసిడర్‌లుగా కూడా వ్యవరించారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఉన్నాడు. అయితే అక్షయ్‌కి సంబందించిన ఓ న్యూస్ తాజాగా బయటికోచ్చింది.
2009 సీజన్‌లో అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ నష్టాల బాట పట్టడంతో అక్షయ్ కుమార్‌తో చేసుకున్న మూడేళ్ల కాంట్రాక్ట్‌ను మధ్యలోనే వదిలేసిందట. అయితే కాంట్రాక్ట్ ప్రకారం అక్షయ్ తనకు రావాల్సిన భారీ మొత్తాన్ని వదులుకుని తన మంచి మనసు చాటుకున్నాడట. ఈ విషయాన్ని మాజీ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ అమృత్ మాథుర్ ఆటో బయోగ్రఫీ ‘పిచ్‌సైడ్: మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్’ పుస్తకంలో తెలిపాడు. 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఎంట్రీ ఇవ్వగా.. ప్రమోషనల్ ఫిల్మ్స్, ఈవెంట్లలో పాల్గొనడం, కార్పొరేట్ ఈవెంట్లకు హాజరు కావడం వంటి బాధ్యతలతో కూడిన కాంట్రాక్ట్‌ను అక్షయ్‌తో కుదుర్చుకుంది. మరుసటి ఏడాదికే ఢిల్లీ నష్టాల బాట పట్టడంతో పొదుపు చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే అక్షయ్‌తో డీల్ క్యాన్సిల్ చేసుకుంది.
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
‘కోట్లా మైదానంలో చేసిన విన్యాసాలు తప్ప అక్షయ్ కుమార్ సేవలను ఎలా వినియోగించుకోవాలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు తెలియలేదు. 2009 సీజన్ ముగింపు సమయంలో ఆర్థిక నష్టాలు తలెత్తాయి. దీంతో అక్షయ్‌తో ఒప్పందాన్ని రద్దు చేయడం లేదా కాంట్రాక్ట్‌పై మళ్లీ చర్చలు చేయాలని ఢిల్లీ నిర్ణయానికొచ్చింది. అయితే కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం అక్షయ్‌తో డీల్‌ను రద్దు చేయడం కష్టం. మూడేళ్ల కాలానికి ఇచ్చిన కాంట్రాక్ట్‌లో పటిష్ఠ గ్యారంటీలు ఉన్నాయి. దీంతో అక్షయ్ సిబ్బందిని ఢిల్లీ జట్టు లాయర్లు కలిశారు. కాంట్రాక్ట్ రద్దు చేసుకునేందుకు వారు సుముఖంగా లేరు. మధ్యలో కాంట్రాక్ట్‌ను రద్దు చేయాల్సి వస్తే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇది డీడీకి సాధ్యం కాదు’ అని అమృత్ మాథుర్ తన ఆటో బయోగ్రఫీలో తెలిపారు.
Also Read: Asia Cup 2023: ఒక్క సిరీస్ కెరీర్‌నే మార్చేసింది.. తిలక్ వర్మకు ఆసియా కప్ 2023లో చోటు!
‘నేరుగా అక్షయ్‌తోనే మాట్లాడాలని ఢిల్లీ యాజమాన్యం డిసైడ్ అయ్యింది. అప్పుడు ‘చాందినీ చౌక్ టు చైనా’ సినిమా షూటింగ్‌లో అక్షయ్ ఉన్నాడు. నేను, మరికొంతమంది ఢిల్లీ యాజమాన్యం అక్కడికి వెళ్లాం. వ్యాన్‌లోకి అతడిని కలిశాం. పరిస్థితిపై వివరణ ఇచ్చి.. విషయం చెప్పాం. అది విన్న అక్షయ్.. వర్కౌట్ కానప్పుడు వదిలేద్దాం అని అన్నాడు. న్యాయపరమైన చిక్కులు గురించి కూడా అక్షయ్‌తో మాట్లాడితే.. నేను మా లాయర్‌కు చెప్తా అన్నాడు. దాంతో ఢిల్లీ సమస్త కొంత తీరింది. అయితే ఇంత పెద్ద మొత్తం అక్షయ్ అంత ఈజీగా ఎలా వదులుకున్నాడని చాలా ఏళ్ల పాటు నేను ఆశ్చర్యానికి గురయ్యా. నిముషాల్లో కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదు. అక్షయ్ మంచి మనసున్నోడు’ అని మాథుర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?