Site icon NTV Telugu

Kannappa: ‘కన్నప్ప’ షూట్ పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్..

Kanappa

Kanappa

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ కోసం దిగ్గజ నటులు నటిస్థున్నారనే సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొంటున్న డా. మోహనబాబు, డా. మోహన్ లాల్, డా. శరత్ కుమార్, ప్రభాస్, డా. బ్రహ్మానందం లాంటి బోగ్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో నటించనున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూట్‌లో పాల్గొన్నట్లు తెలిసింది. అయితే తాజాగా అక్షయ్ కుమార్ తన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశాడు. ఈ విషయమై విష్ణు మంచు సోషల్ మీడియాలో అక్షయ్ కుమార్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు.

Also read: Washing Fruits: పండ్లపై ఉండే రసాయణాలు తొలగాలంటే ఇలా చేయండి..

మహాశివరాత్రి రోజున విడుదలైన కన్నప్ప ఫస్ట్‌లుక్‌ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఒక్కో అప్డేట్‌ తో కన్నప్పపై అంచనాలు పెరిగిపోతున్నాయి. చాలా మంది పాన్-ఇండియన్ స్టార్స్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్ దృష్టిని ఆకర్షించింది. కొద్ది రోజుల క్రితం అక్షయ్ కుమార్ కనప్ప షూటింగ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా అక్షయ్ కుమార్ చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ అంశంపై విష్ణు మంచు చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అక్షయ్ కుమార్‌ తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని., ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని విష్ణు చెప్పుకొచ్చాడు. ప్రయాణం విలువైనది., మళ్లీ మళ్లీ ఇలాగే కలవాలని ఉందని తెలిపాడు.

Also read: Nitish Kumar Reddy: టాలీవుడ్ సూపర్ స్టార్కు వీరాభిమానిని..

కన్నప్ప మీకు సినిమాటిక్ అనుభూతిని అందించే విజువల్ వండర్ అవుతుందని., ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మల్చుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమా అచంచల విశ్వాసం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని., ఇందులో తాను అంకితభావంతో పాత్రను చేసినట్లు తెలిపాడు. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాన్ని విస్తృతం చేస్తామన్నారు.

Exit mobile version