NTV Telugu Site icon

Akshara Gowda : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మాస్ కా దాస్ హీరోయిన్

New Project (20)

New Project (20)

Akshara Gowda : తెలుగు ప్రేక్షకులకు దాస్ కా దమ్కీ, మన్మథుడు 2, హరోం హర, ది వారియర్‌ సినిమాలతో పరిచయం అయిన హాట్ బ్యూటీ అక్షర గౌడ. ఈ కన్నడ బ్యూటీ తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ మంచి గుర్తింపే తెచ్చుకుంది. కమర్షియల్‌గా ఒకటి రెండు హిట్స్ పడి ఉంటే కచ్చితంగా ఈ అమ్మడి క్రేజ్‌, కెరీర్‌ మరోవిధంగా ఉండేది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా తాను తల్లిని అయినట్లు ప్రకటించింది. అంతే కాకుండా తన బిడ్డ ఫోటోను షేర్‌ చేసింది. తద్వారా తన సంతోషాన్ని తన ఫాలోవర్స్‌తో పంచుకుని తన ప్రెగ్నెంట్‌ సమయం ఎలా గడిచిందనే విషయాలను తన అభిమానులతో చెప్పుకొచ్చింది. 2011లో సినిమా ఇండస్ట్రీలో అక్షర గౌడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. చాలా తక్కువ సమయంలోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది. సొంత భాష కన్నడలో మాత్రం ఈ అమ్మడికి 2018 వరకు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. తమిళ్‌, హిందీ సినిమాల్లో మంచి గుర్తింపు రావడంతో అక్కడే సినిమాలు చేస్తూ వచ్చింది. కన్నడంలో ఈమె చేసిన సినిమాలు లెక్కకు కొన్ని మాత్రమే అయినా అక్కడ కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న టైంలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆమె ప్రారంభించింది.

Read Also:Pushpa 2 : పుష్ప 2 సక్సెస్ సంబరాల్లో అల్లు అర్జున్.. ఈ సారి గ్యాప్ తప్పని సరి అయ్యేలా ఉందే

పెళ్లి తర్వాత కూడా ఆ సినిమాల్లో నటించింది. విశేషం ఏంటంటే ఈ ఏడాది కూడా అక్షర నటించిన సినిమా విడుదలైంది. అంటే ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో అక్షర గౌడ ఆ సినిమాలో నటించి ఉంటుంది. పెళ్లి, పిల్లల తర్వాత సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారింది. కనుక అక్షర గౌడ సైతం మళ్లీ సినిమాలతో బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఆమె కన్నడంలో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేసే ఛాన్సులు ఉన్నాయి. ఇంతకు ముందు బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు తన బేబీతో ఉన్న ఫోటోను షేర్‌ చేయడం ద్వారా ముఖ్యాంశాల్లో ఉంది. అక్షరకు ఆమె ఫ్యాన్స్‌ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు.

Read Also:Puhspa 2 : ఓవర్సీస్ లో రికార్డుల రప్ప రప్పా చేస్తున్న పుష్ప రాజ్

Show comments