Site icon NTV Telugu

Indian Racing Festival: F4 రేస్ టైటిల్ గెలుచుకున్న అక్కినేని నాగచైతన్య జట్టు..

Naga Chiatanya

Naga Chiatanya

ఆదివారం కోయంబత్తూర్‌లో జరిగిన డామినెంట్ షోలో హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్ రేసర్‌ అఖీల్‌ అలీఖాన్‌ సత్తా చాటాడు. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యకు చెందిన హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ F4 రేస్ టైటిల్ గెలుచుకుంది. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీ ఓనర్‌గా అక్కినేని నాగ చైతన్య ఉన్నారు. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ రేసర్‌ అకిల్ అలీభాయ్ అద్భుత ప్రదర్శన కనబరిచడంతో ఎఫ్4 ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. గోవా ఏసెస్ JA రేసింగ్‌లో రౌల్ హైమాన్, గాబ్రియేలా జిల్కోవాను అకిల్ అలీభాయ్ ఓడించడంతో ఇండియన్ రేసింగ్ లీగ్ ఛాంపియన్‌షిప్‌ గెలుపొందాడు. బెంగళూరుకు చెందిన రుహాన్ అల్వా (శ్రాచి రార్ రాయల్ బెంగాల్ టైగర్స్) FIA- సర్టిఫైడ్ ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్‌షిప్‌లో గ్రాండ్ డబుల్‌ను సాధించినప్పటికీ.. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ జట్టు యువకుడు అకిల్ అలీభాయ్‌ను ఓడించలేకపోయాడు. దీంతో.. ఛాంపియన్‌షిప్‌లో అల్వా రెండో స్థానంలో నిలిచాడు.

Read Also: Indian Railways: వరుడి రైలు ఆలస్యం..పెళ్లి సమయానికి చేర్చిన రైల్వే.. ఎలా సాధ్యమైందంటే..?

కాగా.. ఇంతకుముందు కూడా పలు రేసింగ్ ఛాంపియన్ షిప్‌లను హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ సొంతం చేసుకుంది. రెండు రోజుల ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్‌ను కింగ్‌ఫిషర్ సోడా, JK టైర్స్, మొబిల్ 1 స్పాన్సర్ చేసింది. అలాగే.. మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్‌కోడ్‌లో ప్రసారం చేశారు. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న చైతూ.. వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఫుడ్ బిజినెస్‏లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే చైతూకు ఆటోమొబైల్స్ అంటే ఆసక్తి ఎక్కువ. కార్, బైక్ రేసింగ్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఇప్పటికే చైతూ వద్ద అనేక లగ్జరీ మోడల్ వెహికల్స్ ఉన్నాయి.

Read Also: AP Assembly Sessions 2024: రేపు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు

Exit mobile version