Site icon NTV Telugu

Lenin : లెనిన్’ షూటింగ్ పూర్తి చేసిన అఖిల్.. కానీ?

Lenin

Lenin

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘లెనిన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నందు (మురళీ కిషోర్ అబ్బూరి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. అఖిల్ తన పాత్రకు సంబంధించిన మేజర్ షూటింగ్ పార్ట్‌ను ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. అయితే, కొన్ని ప్యాచ్ వర్క్ సీన్ల కోసం వచ్చే నెలలో మరోసారి ఆయన సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంత నేపథ్యంతో సాగే ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

Also Read : Dhurandhar : ‘ధురంధర్’ లో తమన్నాను డైరెక్టర్ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..

ఈ సినిమాలో అఖిల్ సరసన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ‘ఏజెంట్’ వంటి భారీ యాక్షన్ చిత్రం తర్వాత అఖిల్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని, ఈ చిత్రంతో అఖిల్ ఖచ్చితంగా పెద్ద హిట్ కొడతారని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్యాచ్ వర్క్‌ను శరవేగంగా పూర్తి చేసి, సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version