NTV Telugu Site icon

Akhil Akkineni : సైలెంట్ గా షూటింగ్ మొదలుపెట్టిన అఖిల్..

Akkineni

Akkineni

అక్కినేని అఖిల్ సినిమాలు మంచి హిట్ ను అందుకోలేదు.. ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు కూడా అతనికి అనుకున్న హిట్ ను ఇవ్వలేక పోయాయి.. గతంలో ఏడాది వచ్చిన భారీ బడ్జెట్ సినిమా ఏజెంట్ కూడా నిరాశపరిచింది.. ఏజెంట్ సినిమా వచ్చి దాదాపు సంవత్సరం కావొస్తున్నా అధికారికంగా నెక్స్ట్ సినిమా ప్రకటించలేదు.. కథల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఇప్పుడు సైలెంట్ గా కొత్త సినిమాను మొదలు పెట్టేశారు..

అఖిల్ నెక్స్ట్ సినిమా అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ సబ్జెక్టుతో రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కొన్ని రాజుల క్రితమే దర్శకుడు అనిల్ అఖిల్ తో ఓ ఫోటోని కూడా షేర్ చేసాడు. అనిల్ గతంలో సాహో సినిమాకి, యూవీ క్రియేషన్స్ సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు.. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ‘ ధీర ‘ అనే టైటిల్ ను ఫిక్స్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

ఇప్పుడు మరో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. సినిమా మహారాష్ట్రలోని ఓ ఫారెస్ట్ లో షూటింగ్ జరుగుతుందని, సినిమా పేరు ధీర అని, ఈ సినిమాలో అఖిల్ క్యారెక్టర్ పేరు తారక సింహా రెడ్డి అని టాలీవుడ్ సమాచారం.. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో అయ్యగారి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారైనా అఖిల్ పెద్ద హిట్ కొట్టాలని అభిమానులతో పాటు తెలుగు ఇండస్ట్రీ ఎదురు చూస్తుంది..ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..