నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. నందమూరి బాలకృష్ణకు సినిమాకు తొలిసారిగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్‌లను సాధించింది. డిసెంబర్ 2న విడుదలైన అఖండ పది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుని ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్లో ఎక్కువ గ్రాస్‌ను కలెక్ట్ చేసిన సినిమాగా గౌతమీ పుత్ర శాతకర్ణి నిలిచింది. కానీ తొలి వారంలోనే ఆ సినిమా కలెక్షన్లను అఖండ దాటేసి ఇప్పుడు వంద కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేసింది.
బాలయ్య వీక్ ఏరియా అయినా నైజాంలోనే ఈ చిత్రం రూ.26 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేయడం విశేషం. ఆంధ్రా రాయలసీమలో కలిపి రూ.50 కోట్లకుపైగానే ఈ సినిమా గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలోని మిగతా ప్రాంతాలు..అలాగే ఓవర్సీస్ కలిపి ఈ చిత్రం పాతిక కోట్ల దాకా వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ సినిమా వంద కోట్ల మార్క్‌ను దాటింది. షేర్ రూ.60 కోట్లకు చేరువగా ఉంది.తొలి వారంలోనే అఖండ రూ.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించడం విశేషమనే చెప్పాలి. ఈ వారం విడుదల అయిన ఏ సినిమాలు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో అఖండనే బాక్సాఫీస్ రూలర్‌గా అఖండనే కొనసాగుతుంది. రెండో వారంలో సైతం ఈ చిత్రానికి హౌస్‌పుల్ కలెక్షన్లు పడుతుండటం విశేషం.
అఖండకు ముందు బాలయ్య మార్కెట్ ఎంతగా పతనం అయిందో తెల్సిందే. ఎన్.టీ.ఆర్ కథానాయకుడు, రూలర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిల బడ్డాయి. కెరీర్లో ఈ దశలో బాలయ్య వంద కోట్ల మార్క్‌ను అందుకుంటాడని ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ అఖండ రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకోవడం అసాధారణ విషయనే చెప్పాలి. ఈ సినిమాకు యావరేజ్ టాకే వచ్చిన బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి అన్ని కలిసి రావడంతో వసూళ్ల మోత మోగిస్తుంది.
