Site icon NTV Telugu

Akhanda 2 సినిమాలో తమన్ విధ్వంసం.. మొత్తానికి పేల్చేశాడుగా..

Akhanda 2 Movie

Akhanda 2 Movie

Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అఖండ 2’. డిసెంబర్ 12న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో దుమ్ము రేపుతోంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా సౌండ్ ఎంత ఇంటెన్స్‌గా ఉందంటే… స్పీకర్లే కాలిపోయాయని అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోను బాలయ్య బాబు అభిమాని ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

READ ALSO: Kavitha : జనం నుంచి మంచి స్పందన వస్తోంది

ఈ వీడియోకు “స్పీకర్ కాలిపోయింది” అంటూ క్యాప్షన్ జత చేశారు. ఈ వీడియో క్లిప్‌లో సినిమాలోని ఒక ఇంటెన్స్ సీన్‌కు థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో కనిపిస్తోంది. ఈ వీడియో క్షణాల్లోనే వేల సంఖ్యలో వ్యూస్ సొంతం చేసుకొని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ద్వారకా థియేటర్‌లో చిత్రీకరించిందిగా చెబుతున్నారు. థమన్ బీజీఎం దెబ్బకు స్పీకర్లు పగిలిపోయాయని బాలయ్య బాబు అభిమానులు తెలిపారు. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తమన్ సరదాగా మాట్లాడుతూ.. ‘ముందే చెబుతున్నా థియేటర్స్‌లో సౌండ్ బాక్స్‌లకు ఏమైనా జరిగితే నాది బాధ్యత కాదు’ అని ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు. కానీ ఆయన సరదాగా అన్నా అది థియేటర్‌లో నిజం కావడంతో బాలయ్య సినిమాలో తమన్ విధ్వంసం గురించి అఖండ 2 అభిమానులు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. సూపర్ హిట్‌ ‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన చిత్రం అఖండ 2. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో కనిపించారు. సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, ఆది పినిశెట్టి కీ రోల్స్‌లో నటించారు.

READ ALSO: John Cena: రిటైర్మెంట్ మ్యాచ్‌లో ఓడిపోయిన జాన్‌సీనా.. ఓడించింది ఇతనే!

Exit mobile version