Akhanda Roxx: ‘అఖండ 2’ సెన్సేషన్.. బాలయ్య పవర్ ఫుల్ ఇమేజ్ కు ప్రత్యేక వాహనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhanda Roxx: మాస్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిస్తే బాక్సాఫీస్ వద్ద విజయం గ్యారంటీ అని చెప్పకనే చెప్పవచ్చు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలవగా.. తాజాగా వస్తున్న ‘అఖండ 2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార కంటెంట్ ఇప్పటికే అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
400% అల్ట్రా స్పీకర్, IP69 ప్రో రేటింగ్, 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ తో Realme C85 5G లాంచ్..!
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక అద్భుతమైన విషయం వైరల్ అవుతోంది. సినిమాలోని బాలకృష్ణ పాత్ర కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనం ‘అఖండ Roxx’ ను చిత్రబృందం గ్రాండ్‌గా లాంచ్ చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆయన కోర్ క్రియేటివ్ టీమ్‌తో కలిసి హాజరయ్యారు. XDrive అత్యాధునిక ఇంజినీరింగ్‌తో నిర్మించి, X Studios సినిమాటిక్ లుక్‌ను అందించిన ఈ వాహనం.. పవర్, మాస్ ఎనర్జీకి సర్రిగా సరిపోయేలా రూపుదిద్దుకుంది. హీరో నందమూరి బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్‌కు అద్దం పట్టేలా, కథనానికి సరిపోయే విధంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దారు.
Nirmala Sitharaman: అమరావతి నిర్మించటంలో రైతుల పాత్ర కీలకం.. దేశంలోనే ఇది మొదటిసారి!
ఈ సందర్భంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ఈ వాహనం డిజైన్ పట్ల తన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక పవర్ వున్న క్యారెక్టర్ దిగి వస్తుంటే దానికి తగ్గ ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో ఈ వెహికిల్ కూడా అంత పవర్ ఫుల్‌గా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా, ఈ వాహనాన్ని అద్భుతంగా డిజైన్ చేసిన అమర్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సుమారు నాలుగు రోజులు పగలు రాత్రి కష్టపడి గొప్పగా డిజైన్ చేసిన అమర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ వాహనాన్ని వెండితెరపై చూసినప్పుడు ఆడియన్స్ మెస్మరైజ్ అవుతారని.. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారని బోయపాటి శ్రీను అన్నారు. అంతేకాకుండా సినిమా గురించి చెబుతూ.. “అఖండ 2” అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, ఇది భారతదేశపు ఆత్మ అని పేర్కొన్నారు. సినిమా చూశాక ఈ విషయం అర్థమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!