Site icon NTV Telugu

Akhanda 2 : ‘అఖండ 2’ తెలుగు సినిమా కాదు.. భారతీయులందరి చిత్రం: బాలయ్య

Akhanda 2

Akhanda 2

Akhanda 2 : డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘అఖండ 2’ సినిమా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. నటసింహం బాలయ్య కెరీర్‌లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలిచింది. ఈ చిత్ర విజయోత్సవంలో భాగంగా బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, చిత్ర బృందం వారణాసిని సందర్శించింది. ఈ సందర్భంగా బాలయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను, తదితరులు కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

READ ALSO: Australia terror attack: సిడ్నీ టెర్రర్ అటాక్.. సాజిద్ భారత లింకులపై దర్యాప్తు..

అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అఖండ 2’ సినిమా కేవలం తెలుగు సినిమా కాదని, భారతీయులందరి చిత్రమని పేర్కొన్నారు. సనాతన హైందవ ధర్మ పరిరక్షణ ఆవశ్యకతను ఈ చిత్రం చాటిందన్నారు. మంచి సినిమా కోసం చేసిన ప్రయత్నం ఫలించిందని చెప్పారు. సినిమా అనేది కేవలం నటన మాత్రమే కాదని… ప్రపంచవ్యాప్తంగా ప్రజలతో కనెక్ట్ అయ్యే మాధ్యమం అని అన్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్త, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

READ ALSO: Avatar: Fire and Ash Review: అవతార్‌: ఫైర్ అండ్ యాష్ రివ్యూ

Exit mobile version