ప్రపంచ సినిమా చరిత్రలో ‘అవతార్’ అనే పేరు ఒక సంచలనం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జేమ్స్ కామెరాన్ సృష్టించిన పండోరా అద్భుత ప్రపంచం మొదటి రెండు భాగాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిందనే చెప్పాలి. అదే భారీ అంచనాలతో ఇప్పుడు మూడవ భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ రివ్యూస్ మాత్రం కొంచెం భిన్నంగా ఉన్నాయి. మరి ఈ సినిమా గత రికార్డులను తిరగరాసేలా ఉందా? జేమ్స్ కామెరాన్ మరోసారి మ్యాజిక్ చేశారా? అనేది తెలియాలి అంటే రివ్యూలో చూసేయండి.
అవతార్: ఫైర్ అండ్ యాష్ (Avatar 3) కథ:
రెండవ భాగం ముగింపులో తన కుమారుడు నెతేయమ్ మరణంతో జేక్ సల్లీ (సామ్ వార్తింగ్టన్), నేతిరి (జో సల్దానా) దంపతులు తీవ్ర విషాదంలో మునిగిపోతారు. అయితే, పండోరాపై ముంచుకొస్తున్న ముప్పు వారిని విశ్రాంతి తీసుకోనివ్వదు. మానవ కాలనీలపై పట్టు సాధించేందుకు ‘నేవి’ Navi తెగ దాడులకు సిద్ధమవుతుండగా, ఊహించని పరిణామం ఒకటి జరుగుతుందు. మానవులకు మద్దతుగా పండోరాలోని అత్యంత క్రూరమైన, అగ్నిని ఆరాధించే ‘మాంగ్‌క్వాన్’ (యాష్ పీపుల్) అనే మరో తెగ రంగంలోకి దిగుతుంది. వారంగ్ (ఊనా చాప్లిన్) నాయకత్వంలోని ఈ అగ్ని తెగ, జేక్ సల్లీ సామ్రాజ్యంపై విరుచుకుపడుతుంది. ఈ అంతర్యుద్ధం పండోరా భవిష్యత్తును ఎలా మార్చింది? కుమారుడిని కోల్పోయిన జేక్, నేతిరి ఈ కొత్త సవాలును ఎలా ఎదుర్కొన్నారు? అనేదే బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే
విశ్లేషణ:
సాధారణంగా జేమ్స్ కామెరాన్ సినిమాలు విజువల్స్‌తో పాటు చాలా క్రిస్పీ కథనంతో సాగుతాయి. కానీ ‘ఫైర్ అండ్ యాష్’ విషయంలో ఆయన తన శైలికి భిన్నంగా ప్లాన్ చేసుకున్నారు. సినిమా మొదటి భాగం పూర్తిగా పాత్రల మధ్య సంభాషణలు, వారి అంతర్గత బాధపైనే దృష్టి పెట్టింది. గంటన్నర పాటు సాగే ఈ ఫస్టాఫ్‌లో యాక్షన్ సన్నివేశాలు తక్కువగా ఉండటం, కేవలం ఎమోషనల్ డ్రామాపైనే ఆధారపడటం వల్ల కథనం నత్తనడకన సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఇది ప్రేక్షకుడి సహనానికి కొంత పరీక్షే. ద్వితీయార్థంలో కామెరాన్ మ్యాజిక్ విజువల్స్ రూపంలో కనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్ (VFX) మరియు గ్రాఫిక్స్ వర్క్ అంతర్జాతీయ ప్రమాణాలకు మించి ఉన్నాయి. పండోరాలో కొత్తగా పరిచయం చేసిన అగ్ని ప్రపంచం విజువల్ గా అబ్బురపరుస్తుంది. అయితే, సీన్ల పరంగా చూస్తే రెండవ భాగమైన ‘వే ఆఫ్ వాటర్’ లోని కొన్ని సన్నివేశాలు రిపీట్ అయినట్లు అనిపిస్తాయి. కథలో ఆశించిన స్థాయిలో వేగం పెరగకపోవడం మరియు క్లైమాక్స్ లో ఉండాల్సిన ఆ ఇంపాక్ట్ మిస్ అవ్వడం నిరాశ కలిగిస్తుంది. నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సామ్ వార్తింగ్టన్ & జో సల్దానా జేక్ సల్లీ, నేతిరి పాత్రల్లో వీరిద్దరూ జీవించారు. తమ కుమారుడి మరణం తర్వాత వారు పడే వేదనను కళ్ళకు కట్టినట్లు చూపారు. వీరు చూపిన వైవిధ్యం సినిమాకు పెద్ద అసెట్. ఇక లెజెండరీ యాక్టర్ చార్లీ చాప్లిన్ మనవరాలైన ఊనా, విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టారు. యాష్ ట్రైబ్ నాయకురాలిగా ఆమె పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. రోనల్ పాత్రలో కేట్ విన్స్‌లెట్ తన పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.ఇక సాంకేతిక విభాగం పని తీరు విషయానికి వస్తే సినిమాకు వెన్నెముక రస్సెల్ కాప్పెంటర్ సినిమాటోగ్రఫీ. ప్రతి ఫ్రేమ్ ఒక అద్భుతమైన పెయింటింగ్ లా కనిపిస్తుంది. సైమన్ ఫ్రాగ్లెన్ సంగీతం యుద్ధ సన్నివేశాలలో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అయితే, ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. జేమ్స్ కామెరాన్ విజన్ కు తగ్గట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.
ఫైనల్’గా ఈ అవతార్ 3 ఫైర్ మిస్