Akhanda 2: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసింది. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పించారు.
READ ALSO: Supreme Court: ‘‘అందర్ని చంద్రుడిపైకి పంపాలా.?’’ భూకంపాల పిటిషన్‌పై సుప్రీంకోర్ట్..
‘అఖండ 2: ది తాండవం’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ.. సినిమా ఆలస్యానికి అభిమానులకు క్షమాపణ చెప్పారు. “అందరికీ నమస్కారం. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ఒక వారం రోజులు వాయిదా పడింది. ఈ సందర్భంగా మా బాలయ్య బాబు గారికి, డైరెక్టర్ బోయపాటి శ్రీను గారికి, అలాగే బాలయ్య బాబుగారి ఫ్యాన్స్‌కి మా ప్రొడక్షన్ తరఫున క్షమాపణలు (సారీ) చెప్తున్నాం. ఈ సమస్యను పరిష్కరించడంలో మాకు మ్యాంగో మీడియా రామ్ గారు, నిర్మాత దిల్ రాజు గారు చాలా సపోర్ట్ చేశారు. వారికి మా ధన్యవాదాలు” అని గోపి ఆచంట అన్నారు.
ఒక వారం రోజులు ఆలస్యమైనప్పటికీ, డిసెంబర్ 12న ప్రీమియర్స్‌తో విడుదలైన ఈ సినిమాకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిందని నిర్మాత తెలిపారు. “మేము భ్రమరాంబ థియేటర్‌లో చూశాం. ఫ్యాన్స్ అసలు సీట్లో కూర్చోవడం లేదు. నిలుచుని, చప్పట్లు, విజిల్స్‌తో అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఈరోజు మార్నింగ్, మ్యాట్నీ షోలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అన్ని ఏరియాల నుంచి మంచి కలెక్షన్స్, రిపోర్ట్స్ వస్తున్నాయి” అని గోపి ఆచంట వివరించారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఉత్తరాదిలోనూ సినిమా బాగా ఆడుతోందని ఆయన తెలిపారు. “నార్త్‌లో జి సినిమాస్ ద్వారా దాదాపు 800 స్క్రీన్స్లో రిలీజ్ చేశాం. అక్కడ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమాకు వర్డ్ ఆఫ్ మౌత్ బ్రహ్మాండంగా ఉంది. సూపర్ ట్రెండ్‌లో టికెట్స్ బుక్ అవుతున్నాయి. త్వరలోనే రెండు రాష్ట్రాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ చేయాలని భావిస్తున్నాము” అని గోపి ఆచంట ప్రకటించారు.
READ ALSO: Vaibhav Suryavanshi: శతక్కొడుతున్న చిచ్చరపిడుగు.. ఆరు టోర్నమెంట్‌లు.. ఆరు శతకాలు
