Young Hero Nandu: అఖండ 2 దెబ్బకు టాలీవుడ్ యంగ్ హీరో సఫర్ అయ్యాడు.. గత కొన్ని రోజుల కిందట వాయిదా పడిన ‘అఖండ-2: తాండవం’ సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ వార్త ఓ వైపు అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. కానీ.. మరోవైపు.. ఓ టాలీవుడ్ యంగ్ హీరోను మాత్రం సఫర్ అయ్యేలా చేసింది. ఆ హీరో నటించిన సినిమా తేదీ రోజే అఖండ 2 విడుదల అవుతుండటమే కారణం.. ఆ హీరో కొంత ఎమోషనల్ అయినా.. కొత్త తేదీ ప్రకటిస్తానని.. ప్రేక్షకుల ఆదరణ పొందుతానని ధీమాగా ఉన్నాడు. ఇంతకీ ఎవరు ఆ హీరో ఏంటా సినిమా అనే విషయం గురించి తెలుసుకుందాం..
READ MORE: CM Revanth Reddy : జల్, జంగిల్, జమీన్ అని కొమురం భీమ్ పోరాడిన గడ్డ ఇది
టాలీవుడ్ యువ నటుడు నందు, యామిని భాస్కర్ జంటగా నటిస్తున్న సినిమా ‘సైక్ సిద్ధార్థ’. మీలాంటి యువకుడి కథ అనేది ఉపశీర్షికతో యువతను ఆకట్టుకునేందుక ప్రేక్షకుల ముందుకు రానుంది. అడల్ట్ కామెడీతో తెరకెక్కుతున్న ఈ మూవీకి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రి, మౌనిక తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాత శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు నందు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాణ బృందం ముందుగానే ప్రకటించింది. కానీ.. అదే తేదీన అఖండ 2 విడుదలవుతుండటంతో సినిమాను తాత్కాలిక వాయిదా వేశారు. ఈ క్రమంలో సినిమా యంగ్ హీరో నందు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. “18 సంవత్సరాలు, విడుదల తేదీ కోసం ఇంకా పోరాడుతున్నాను.. రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తాను.. రేపు కొత్త విడుదల తేదీని అద్భుతమైన వీడియోతో ప్రకటిస్తాను.” అని పోస్ట్‌లో పేర్కొన్నాడు. అంతే కాదు.. ఎమోషనల్ ఫొటో సైతం పోస్ట్ చేశాడు..
