NTV Telugu Site icon

Akhanda2 : దేవాలయాల పవిత్రత కాపాడే ‘అఖండ’.. ఈ పాయింట్ ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉందే !

Akhanda 2 Jpeg

Akhanda 2 Jpeg

Akhanda2 : ప్రస్తుతం సీనియర్ హీరోల్లో వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. గతేడాది వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న ఆయన వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో తన అభిమానులను అలరించేందుకు రెడీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తదుపరి సినిమాను సూపర్ హిట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఫిక్స్ చేసుకున్నాడని తెలిసిందే. సూపర్ హిట్ మూవీ అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 అని ఈ మధ్యనే గ్రాండ్ గా అనౌన్స్ కూడా చేశారు. అయితే బాలయ్య బాబు చేస్తున్న అఖండ 2 సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన ఒక న్యూస్ బయటకు లీక్ అయి సంచలనంగా మారింది. ఇందులో ఆయన దేవాలయాల పవిత్రత కాపాడే పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. అంతేకాదు హిందు గ్రంథాల జోలికి వచ్చి.. వాటిని హేళన చేసే వారి భరతం పడతాడట. అఖండ సినిమాలో బాలయ్య బాబు అఘోర లుక్ తో ఆడియన్స్ ని మెప్పించారు. అఖండ 2 లో కూడా అలాంటి పవర్ ఫుల్ పాత్రలో అలరిస్తారని తెలుస్తుంది.

Read Also:OTT Movies: మూవీ లవర్స్‌కు పండగే.. ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు!

బాలయ్య బోయపాటి కాంబో అంటేనే సూపర్ హిట్ అన్నది గత సినిమాలతో ప్రూప్ అయిన సంగతి తెలిసిందే. సింహాతో మొదలైన వారి కాంబో వరుస సినిమాలను చేస్తూ బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్నారు. అఖండ తర్వాత మళ్లీ అఖండ 2 తోనే మరో సంచలనానికి సిద్ధం అయింది ఈ దిగ్గజ ద్వయం. అఖండ 2 కేవలం తెలుగులోనే కాదు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అఖండ 2 సినిమా విషయంలో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదని తెలుస్తోంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్ కూడా నిర్మి్స్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బ్యూటీ ఫుల్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుంది. అఖండ 2 సినిమా కోసం బాలయ్య తన మేకోవర్ కూడా సంసిద్ధం చేసుకుంటున్నారు. సినిమా ఓపెనింగ్ రోజే పవర్ ఫుల్ డైలాగ్ తో అదరగొట్టిన బాలయ్య సినిమాలో అలాంటి డైలాగ్స్ కోకొల్లలు ఉండేలా చూసుకుంటున్నారట. మొత్తానికి అఖండ 2 ఫ్యాన్స్ ఎలాంటి అంచనాలు పెట్టుకున్నారో దానికి మించి ఉండేలా చూస్తున్నారు మేకర్స్. ఈ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ తో వస్తుందంటే అఖండ 2 పాన్ ఇండియా లెవెల్ లో భారీ రికార్డులను నమోదు చేయడం ఖాయమనే చెప్పాలి. అఖండ 2 సినిమాలో కూడా బాలయ్య డ్యుయల్ రోల్ లో నటించే ఛాన్స్ ఉంది.

Read Also:Savings Account In Bank: సేవింగ్స్ అకౌంట్‭లో పరిమితికి మించి నగదు డిపాజిట్ చేస్తే ఐటీ నోటీసు షురూ

Show comments