Akashteer India: చైనా పర్యటనలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రధాన దేశం భారత్. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్‌తో భారత్ బలం ఏంటో ప్రపంచానికి చూపించింది. తాజాగా బయటికి వచ్చిన విషయం సంచలనం సృష్టిస్తుంది. భారతదేశ స్వదేశీ వైమానిక రక్షణ వ్యవస్థ ఆకాష్టీర్ ఇప్పుడు దేశ సైన్యానికి బలమైన కవచంగా మారబోతోంది. రక్షణ వర్గాల ప్రకారం.. ఆకాష్టీర్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటి వరకు 455 వ్యవస్థలలో దాదాపు 275 పంపిణీ చేశారు. వచ్చే ఏడాది అంటే 2026 నాటికి, అన్ని వైమానిక రక్షణ సెన్సార్లు ప్రతి బ్రిగేడ్, యూనిట్ స్థాయిలో అనుసంధానించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సైన్యం వద్ద ఉన్న వాటితో ఉత్తర సరిహద్దు (చైనా), పశ్చిమ సరిహద్దు (పాకిస్థాన్) పూర్తిగా కవర్ చేశారు. ఆకాష్టీర్‌ను భారత సైన్యంలోని ప్రతి కార్ప్‌స్ స్థాయిలో చేర్చారు.
READ ALSO: Padi Kaushik Reddy : గ్రూప్-1 అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి
పెరగనున్న బలం..
ఆకాష్టీర్ పూర్తిగా అమలు చేసిన తర్వాత, భారతదేశ వైమానిక రక్షణ నెట్‌వర్క్ మరింత బలపడుతుంది. ఆపరేషన్ సింధూర్‌లో, పాకిస్థాన్ నుంచి డ్రోన్, క్షిపణి, రాకెట్ దాడులు జరిగినప్పటికీ, భారత స్థావరాలు సురక్షితంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఆకాష్టీర్. దీని సహాయంతో, శత్రువుల కార్యకలాపాలను సకాలంలో ట్రాక్ చేసి వాటిని నాశనం చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్‌లో 60 శాతం పని మాత్రమే పూర్తయింది. అయినప్పటికీ ఇది తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది.
ఆకాష్టీర్ ప్రత్యేకత ఏమిటంటే ఇది సైన్యం, వైమానిక దళం, అన్ని రాడార్‌లను అనుసంధానించడం ద్వారా రియల్-టైమ్‌లో పూర్తి చిత్రాన్ని చూపిస్తుంది. ఇది ఏ ప్రాంతంలోనైనా, ఏ వాతావరణంలోనైనా, ఏ సరిహద్దులోనైనా మోహరించిన యూనిట్లకు ఆకాశంలో ఎగురుతున్న వస్తువు శత్రువుదా లేదా మిత్రుడిదా అని వెంటనే తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. గతంలో, సైన్యం, వైమానిక దళం రాడార్లు వేర్వేరు సమాచారాన్ని అందించేవి. ఆపరేటర్లు ఈ చిత్రాలను మాన్యువల్‌గా విశ్లేషించి, వాటిని సమన్వయం చేయాల్సి వచ్చేది. కానీ ఆకాష్టీర్ అన్ని రాడార్‌లను కలిపి పూర్తి రియయల్ – టైం చిత్రాలను చూపుతుంది. ఇది వాయు రక్షణ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంతో పాటు పరిస్థితులపై అవగాహన కల్పిస్తుందని అంటున్నారు. ఆకాష్టీర్ నిజంగా భారత దేశానికి రక్షణ కవచంగా మారనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
READ ALSO: Peter Navarro: బ్రిక్స్‌పై విషం చిమ్మిన ట్రంప్ సలహాదారు.. రక్త పిశాచి అంటూ పోస్ట్
