అజిత్ ఏడాదికోసారి కూడా కనిపించడదు. రెండేళ్లకో సినిమాతో వచ్చే ఈ తమిళ స్టాట్ తీసుకున్న నిర్ణయంతో ఫ్యాన్ష్ బంబేలు ఎత్తిపోతున్నారు. అజిత్‌కు ఎట్టకేలకు గుడ్ బ్యాడ్ అగ్లీ’తో హిట్ పడింది. కెరీర్ ఫస్ట్ టైం 200 కోట్ల మార్క్ దాటాడు. అజిత్‌ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ హీరోకు అలాంటి ఎలివేషన్ ఇచ్చాడు. నెక్ట్స్ మూవీని నవంబర్‌లో స్టార్ట్‌చేసిన 2026లో సమ్మర్లో రిలీజ్ చేస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో అజిత్ చెప్పినా.. ఇంతవరకు సెట్స్‌పైకి రాలేదు.
Also Read : Jr NTR : నారా లోకేష్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే విషెష్
ఒకవైపు సినిమా.. మరోవైపు రేసింగ్‌కు సమాన న్యాయం చేయలేకపోయానని.. ఇక నుంచి రేసింగ్ సీజన్ నడుస్తున్నప్పుడు సినిమాలకు దూరంగా వుంటానని అజిత్ చెప్పడంతో ఫ్యాన్స్ ఖంగుతిన్నారు. ఈమధ్యకాలంలో అజిత్ రేసింగ్‌పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ.. సినిమాలను డిలే చేస్తున్నాడు. సినిమాపై కాన్సన్ట్రేషన్ చేయడం లేదని అందుకే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయన్న చర్చ నడుస్తోంది. అజిత్ రేసింగ్ మాయలో పడి సరైన కథలు ఎంచుకోవడంలేదని ఫ్యాన్సే ఫీలవుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్‌కు ఇదే కారణమంటూ విమర్శలు వస్తున్నా అజిత్ పట్టించుకోవడం లేదు. రేసింగ్ సీజన్లో సినిమాలకు దూరంగా వుంటానని అజిత్ చెప్పడంతో.. ఇక సినిమాలు అనుకున్న టైంలో పూర్తికావడం కష్టమే అంటున్నారు. సూపర్‌హిట్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఇచ్చిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్.. నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్‌కే మరో ఛాన్స్ ఇచ్చాడు అజిత్. ఈ కొత్త సినిమా ఫిబ్రవరిలో సెట్స్‌పైకి తీసుకొచ్చి 2026 క్రిస్మస్కు రిలీజ్ చేయాలన్న ప్లాన్‌లో మేకర్స్ వున్నారు.