Site icon NTV Telugu

Ajith Kumar: ప్రాణాలనే పణంగా పెట్టేసిన అజిత్.. వీడియో వైరల్

Ajith

Ajith

Ajith Kumar: కోలీవుడ్ సూపర్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. దక్షిణ భారత దేశంలో ఉన్న సినీ ఇండస్ట్రీలో అజిత్ పనిచేసిన అనుభవం ఉంది. అజిత్ కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా పలు వార్తలలో కూడా తరచుగా నిలుస్తుంటాడు. తను ఒక్కడే బైక్ రైడింగ్ చేసుకుంటూ తనకి ఇష్టమైన లైఫ్ ను ఒక్కోసారి ప్రశాంతంగా గడుపుతుంటాడు. నిజం చెప్పాలంటే.. ఆయనకు ఒక సొంత మొబైల్ ఫోన్ కూడా ఉపయోగించరు. చాలా దూరంగా బతికేస్తుంటారు. ఇకపోతే ఆయన ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. తునీవు సినిమాతో పలకరించిన ఆయన.. మరోసారి విదాముయర్చి సినిమాతో పలకరించబోతున్నాడు. గత కొద్ది రోజుల నుంచి ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ సినిమా కోసం అజిత్ తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా స్టంట్స్ చేశాడు.

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన సీబీఐ..

సినిమాలోని ఓ యాక్షన్ సీన్ కోసం అజిత్ స్వయంగా కారు నడుపుతూ ప్రమాదానికి ఇదివరకు ఒకసారి గురయ్యాడు. అజిత్ నడిపిన కారు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి మూడు పల్టీలు కొట్టింది. అయితే అతనికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డాడు. అయితే తాజాగా మరోసారి ఇలాంటి ఘటనకు సంబంధించిన షూటింగ్లో ఆయన ప్రాణాలను పణంగా పెట్టి యాక్షన్ సీన్స్ లో నటించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలలో కారును క్రేన్ సహాయంతో గాల్లోకి లేపారు. అలా గాలిలో ఉన్నప్పుడు అందులో హీరో అజిత్ తో పాటు మరో నటుడు ఆరవ్ కూడా ఉన్నారు. క్రేన్ సహాయంతో గాల్లోకి వెళ్లిన తర్వాత ఆ కారు కొన్ని పల్టీలను కొట్టించారు. ఆ సమయంలో ఇద్దరు నటులు కారులోనే ఉండడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

Om Birla: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక..

నిజానికి ఇలాంటి డేంజర్ స్టంట్స్ చేయడం చాలా రిస్క్. అందులోనూ స్టార్ హీరో ఇలాంటి డూప్ లేకుండా ఇలాంటి సాహసాలు చేయడం అంటే నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. విదాముయర్చి సినిమా కోసం అజిత్ ఈ స్టంట్స్ చేశారు. ఈ వీడియోని చూసిన సినీ ప్రేక్షకులు సినిమా కోసం ప్రాణము ఇవ్వడం అంటే ఇదే కాబోలంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే.. నువ్వు రియల్ హీరో అంటూ ఆయనను పొగడ్తలతో ముంచేస్తున్నారు.

Exit mobile version