Om Birla: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక..
- లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా..
- వరసగా రెండోసారి ఎన్నిక..
- పార్లమెంట్ చరిత్రలో మూడోసారి స్పీకర్ పదవికి పోటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Om Birla: లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. 50 ఏళ్ల తరువాత తొలిసారిగా లోక్‌సభ స్పీకర్ పోస్టు కోసం అధికార, ప్రతిపక్షాలు పోటీ పడ్డాయి. ఎన్డీయే తన అభ్యర్థిగా ఓం బిర్లాను ప్రతిపాదించగా, కాంగ్రెస్ ఎంపీ కే. సురేష్‌ని ఇండియా కూటమి ప్రతిపాదించింది. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఓంబిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
Read Also: Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన సీబీఐ..
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
మూడుసార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా, గత పార్లమెంట్‌లో కూడా లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. వరసగా రెండోసారి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈ రోజు లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆయన స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికైన ఓంబిర్లాకు ప్రధాని నరేంద్రమోడీ కరచాలనం చేసి శుభాకాంక్షలు చెప్పారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఓంబిర్లాను అభినందించారు. ప్రధాని, ప్రతిపక్ష నేత, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అతడిని స్పీకర్ కుర్చీపై కూర్చోపెట్టారు.
స్వాతంత్రం అనంతరం ఇది మూడోసారి స్పీకర్ ఎన్నిక. చాలా సందర్భాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏకగ్రీవంగా స్పీకర్‌ని ఎన్నుకునే సంప్రదాయం ఉంది. అయితే, ఈ సారి మాత్రం డిప్యూటీ స్పీకర్ పోస్టు తమకు ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష ఇండియా కూటమి పోటీలో నిలబడింది. ఎన్డీయే కూటమికి స్వతహాగా 293 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు కూడా ఓంబిర్లాకు మద్దతు తెలిపారు. ఇండియా కూటమికి 232 మంది ఎంపీల ఉన్నారు. స్పీకర్ ఎన్నికకు 271 ఓట్లు అవసరం కాగా, ఓం బిర్లా సునాయాసంగా విజయం సాధించారు.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!