కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి తెలిసిందే. ‘ఖైదీ’ సినిమాతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిన లోకేష్.. మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో మెప్పించాడు. అయితే ఇటీవల వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ సినిమాలో అతడి మార్క్ మిస్ అయింది. కమర్షియల్ పరంగా హిట్ అయినప్పటికీ.. లోకేష్ వీకెస్ట్ వర్క్ సినిమా ఇదే అని క్రిటిక్స్ పెదవి విరిచేశారు. ఆయన అభిమానులు కూడా డిసప్పాయింట్ అయ్యారు. దీంతో ఇప్పుడు లోకేష్ నెక్స్ట్ సినిమా ఏంటనేది తేలకుండా ఉంది.
కూలీ చూశాక లోకేష్‌తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనేది కోలీవుడ్ టాక్. నిజానికి లోకేష్ లైనప్‌లో ఖైదీ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇప్పుడు హీరో కార్తి ఇంకా డేట్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. అటు అమీర్ ఖాన్‌తో అనుకున్న సినిమా వర్కౌట్ కాలేదు. కమల్ హాసన్, రజనీ కాంత్‌తో భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ఉంటుందనే ప్రచారం జరగ్గా.. ఇప్పుడు అది నెల్సన్ దిలీప్ కుమార్ చేతికి వెళ్లినట్టుగా టాక్.
పోనీ టాలీవుడ్ హీరోలతో చేద్దామని అనుకుంటే.. ఎవరికి వారు ఆయా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. దీంతో తలా అజిత్ కుమార్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట లోకేష్. నిజానికి చాలా కాలంగా అజిత్‌తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ లోకేష్ ఇతర కమిట్మెంట్స్ కారణంగా కుదరలేదు. ఇప్పుడు లోకేష్-అజిత్ కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే కూలీ చూసిన తర్వాత అజిత్ ఫ్యాన్స్ ఇప్పుడు లోకేష్‌తో అవసరమా? అని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ అయినా వర్కౌట్ అవుతుందా? అనే సందేహాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు హీరోగా ఎంట్రీ ఇస్తున్న లోకేష్.. ప్రస్తుతం దర్శకుడిగా కాస్త గ్యాప్ తీసుకున్నట్టుగా చెబుతున్నారు. కాబట్టి లోకేష్ కొత్త ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ రావాలంటే.. ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.
