చెన్నైలో జరిగిన ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ విజయాన్ని అజిత్ దోవల్ వివరించారు. భారతదేశం నష్టాన్ని చూపించే ఒక్క చిత్రాన్ని అయినా తనకు చూపించాలని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పలు విదేశీ మీడియా సంస్థలు పాకిస్థాన్ భారత్‌లోని పలు ప్రాంతాలను ధ్వంసం చేశాయని కథనాలు రాశాయి. ఈ అంశంపై తాజాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పందించారు.
READ MORE: World Population Day: ప్రపంచ జనాభా దినోత్సవంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ఆపరేషన్ సిందూర్ గురించి అజిత్ దోవల్ మాట్లాడుతూ.. “ఆపరేషన్ సిందూర్‌కు 23 నిమిషాలు పట్టింది. పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఆపరేషన్ సిందూర్ పట్ల గర్విస్తున్నాం. ఆ నిర్ణీత 9 లక్ష్యాలపై తప్ప మరెక్కడా దాడి చేయలేదు. దాడులు ఖచ్చితమైనవి. బ్రహ్మోస్, రాడార్ లాంటి స్వదేశీ ఆయుధాలతో దాడులు జరిపాం.” అని ఆయన వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ గురించి తప్పుడు నివేదికలు ఇచ్చిన విదేశీ మీడియాపై అజిత్ దోవల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
READ MORE: Radhika Yadav: రాధిక తల్లి షాకింగ్ ప్రవర్తన.. పోలీసులకు ఏం చెప్పిందంటే..!
పాకిస్థాన్ దాడులు చేసిందని విదేశీ మీడియా చెప్పింది. భారత్‌లో ఏదైనా భవనానికి నష్టం వాటిల్లినట్లు చూపించే ఒక్క ఫోటోను నాకు చూపించండి అని ప్రశ్నించారు. మన దేశంలో ఒక్క గాజు ముక్క కూడా పగిలిపోలేదు. విదేశీ మీడియాలు తప్పుడు నివేదికలు ఇచ్చాయని మండిపడ్డారు. సర్గోధ, చక్లాలా, రహీమ్ యార్ ఖాన్ సహా 13 పాకిస్థాన్ వైమానిక స్థావరాల ముందు, తరువాత ఉపగ్రహ చిత్రాలను ఆయన చూయించారు. పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఈ ఆపరేషన్ లో స్వదేశీ సామర్థ్యాన్ని హైలైట్ చేశారు.
