All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!

  • ఆల్‌టైమ్ భారత టెస్ట్ XIని ఎంపిక చేసిన అజింక్య రహానే..
  • జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు దక్కని చోటు
  • ఓపెనర్లుగా మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లను ఎంపిక
  • రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్‌లకు కీలక స్థానాలు..
All Time India Test Xi

All Time India Test Xi

Ajinkya Rahane All-Time India Test XI: టీమిండియా మాజీ టెస్ట్ కెప్టెన్ అజింక్య రహానే తన ఆల్‌టైమ్ భారత టెస్ట్ XIను ఎంపిక చేశాడు. అయితే ఇందులో ఓ ప్రత్యేక నిబంధన నేపథ్యంలో ఎంపిక చేయాలి. రహానే అంతర్జాతీయ లేదా దేశవాళీ క్రికెట్‌లో తనతో కలిసి ఆడిన ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయాల్సి వచ్చింది. దిగ్గజ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంచుకున్న రహానే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు మాత్రం చోటు కల్పించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అజింక్య రహానే ఎంపిక చేసిన జట్టులో ఓపెనర్లుగా మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లను రహానే ఎంపిక చేశాడు. మూడో స్థానంలో రాహుల్ ద్రవిడ్, నాలుగో స్థానంలో సచిన్ టెండూల్కర్‌కు చోటిచ్చాడు. ఐదో స్థానంలో తనను తాను ఎంపిక చేసుకున్న రహానే.. ఆరో స్థానంలో ఎంఎస్ ధోనీని తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన తొలి కెప్టెన్ కావడంతో ధోనీనే ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. ఇక స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు దక్కింది. వీరిద్దరూ ఆల్‌రౌండ్ సామర్థ్యంతో జట్టుకు అదనపు బలంగా ఉంటారని రహానే భావించాడు.

మరోవైపు పేస్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మలను ఎంపిక చేశాడు. విదేశీ గడ్డపై భారత్ సాధించిన పలు చిరస్మరణీయ టెస్ట్ విజయాల్లో ఈ పేసర్లు కీలక పాత్ర పోషించారు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా కోహ్లీతో రహానే ఎన్నో కీలక టెస్ట్ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రహానేను తనకు అత్యంత ఇష్టమైన టెస్ట్ బ్యాటింగ్ భాగస్వామిగా కోహ్లీ గతంలో పేర్కొనడం కూడా.

అజింక్య రహానే ఆల్‌టైమ్ భారత టెస్ట్ XI:

మురళీ విజయ్, శిఖర్ ధావన్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, అజింక్య రహానే, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ.