NTV Telugu Site icon

IPL 2023 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు రహానేకు ఛాన్స్..?

Rahane Wtc

Rahane Wtc

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 ముగిసిన అనంతరం టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియాతో తలపడేందుకు ఇంగ్లండ్ కు వెళ్లనుంది. జూన్ 7 నుంచి లండన్ లోని ఓవల్ స్టేడియంలో జరుగనున్న డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగునుంది. అయితే డబ్య్లూటీసీ ఫైనల్ కు ముందు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానేకు బంఫరాఫర్ తగిలే అవకాశం ఉంది. గాయం కారణంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సిప్ ఫైనల్ కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో అజింక్య రహానే జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అజింక్యా రహానే దుమ్మురేపుతున్నాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రహానే 27బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 31 పరుగులతో అదరగొట్టాడు రహానే.

Read Also : Malavika Avinash: ఆసుపత్రి పాలైన ‘కెజిఎఫ్’ నటి.. దాన్ని ఈజీగా తీసుకోకండి అంటూ పోస్ట్

ఈ క్రమంలోనే రహానే మళ్లీ జాతీయ జట్టులోకి పిలుపునివ్వాలని భారత సెలక్టర్లు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే తొలుత అయ్యర స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా సెలక్టర్లు తమ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో విదేశీ పిచ్ లపై అనుభవం ఉన్న రహానే వైపు మొగ్గు చూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అదే జరిగితే రంజీ సీజన్ 2022-2023లో రహానే అదరగొట్టాడు. 7 మ్యాచ్ లు ఆడిన రహానే 57.63 సగటుతో 634 పరుగులు చేశాడు. అతడి ఇన్సింగ్స్ లలో ఒక సెంచరీ, డబుల్ సెంచీరీ ఉన్నాయి. ఒక రహానే చివరగా భారత్ తరపున గతేడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాపై ఆడాడు.

Read Also : Gangster Atiq Ahmed: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు ఎన్‌కౌంటర్‌