NTV Telugu Site icon

Maidaan OTT: ఓటీటీలోకి అజయ్‌ దేవ్‌గణ్‌ ‘మైదాన్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Maidaan Ott

Maidaan Ott

Ajay Devgn’s Maidaan OTT Release Date: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తాజాగా నటించిన సినిమా ‘మైదాన్‌’. అమిత్ శర్మ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్‌ డ్రామా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైద‌రాబాద్‌కు చెందిన దిగ్గ‌జ ఇండియ‌న్ ఫుట్‌బాల్ కోచ్ స‌య్య‌ద్ ర‌హీమ్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెర‌కెక్కింది. దాదాపు 235 కోట్ల బ‌డ్జెట్‌తో జీ స్టూడియోస్‌తో క‌లిసి బోణీ క‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మైదాన్‌ చిత్రం సినీ ప్రియుల్ని మెప్పించినా.. వ‌సూళ్ల‌ను మాత్రం పెద్దగా రాబ‌ట్ట‌లేక‌పోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బుధ‌వారం నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా మైదాన్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంట‌ల్ విధానంలో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి రెంట‌ల్ విధానంలో (రూ.349) మైదాన్‌ అందుబాటులోకి వచ్చింది. జూన్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రైబ‌ర్లు అంద‌రికి ఈ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రియమణి, రుద్రనీల్ ఘోష్, చైతన్య శర్మ కీలక పాత్రలు పోషించారు. స‌య్య‌ద్ ర‌హీమ్ పాత్ర‌లో అజ‌య్‌ దేవ్‌గ‌ణ్ న‌టించాడు. మైదాన్ మూవీతో కీర్తి సురేష్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. ప్రియ‌మ‌ణి పాత్ర కోసం ముందుగా కీర్తినే తీసుకున్నారు. అయితే ర‌హీమ్ భార్య‌ రోల్‌కు ఆమె యాప్ట్ కాద‌నే ఆలోచ‌న‌తో తప్పించారు.

Also Read: USA vs BAN: కోరీ అండర్సన్ విధ్వంసం.. బంగ్లాదేశ్‌పై అమెరికా సంచలన విజయం!

1950 ద‌శ‌కంలో ఇండియ‌న్ ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌గా ర‌హీమ్ (అజ‌య్ దేవ్‌గ‌ణ్‌) నియ‌మితుడ‌వుతాడు. కానీ ఫుట్‌బాట్ ఆట‌లో బెంగాళ్‌దే ఆధిప‌త్యం కావ‌డంతో.. ర‌హీమ్ కోచ్‌గా సెలెక్ట్ కావ‌డం నచ్చని కొంద‌రు బెంగాళీయులు కుట్ర‌లు పన్ని ప‌ద‌వి పోయేలా చేస్తారు. తిరిగి కోచ్‌గా నియ‌మితుడు కావ‌డానికి ర‌హీమ్‌కు ఎవరు సాయం చేశారు?, ర‌హీమ్ మార్గ‌ద‌ర్శ‌నంలో ఇండియ‌న్ ఫుట్‌బాల్ టీమ్ ఏషియ‌న్ గేమ్స్‌లో ఎలా ప‌త‌కం గెలిచింది అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

Show comments