USA vs BAN: కోరీ అండర్సన్ విధ్వంసం.. బంగ్లాదేశ్‌పై అమెరికా సంచలన విజయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
United States won by 5 wkts against Bangladesh: టీ20 క్రికెట్‌లో అమెరికా (యూఎస్ఏ) సంచలనం సృష్టించింది. పూర్తి సభ్య దేశంపై తొలి విజయాన్ని నమోదు చేసింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు టీ20 సిరీస్‌లో ఈ ఘనత అందుకుంది. హౌస్టన్ వేదికగా మంగళవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాపై యూఎస్ఏ 5 వికెట్ల తేడాతో గెలిచింది. యూఎస్ఏ విజయంలో కోరీ అండర్సన్ (34), హర్మీత్ సింగ్ (33) కీలక పాత్ర పోషించారు. నాలుగు ఓవర్లలో తక్కువ రన్స్ ఇవ్వడంతో పాటు కీలక ఇన్నింగ్స్ ఆడిన హర్మీత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. తౌహిద్ హృదయ్ (58; 47 బంతుల్లో 4×4, 2×6) హాఫ్ సెంచరీ చేశాడు. లిటన్ దాస్ (14; 15 బంతుల్లో 1×4, 1×6), సౌమ్య సర్కార్ (20; 13 బంతుల్లో 3×4), షాంటో (3), షకిబ్ అల్ హసన్ (6) నిరాశపర్చగా.. మహ్మదుల్లా (31; 22 బంతుల్లో 2×4, 1×6) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. యూఎస్‌ఏ బౌలర్లలో స్టీవెన్ టేలర్ రెండు వికెట్లు తీశాడు.
Also Read
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
Also Read: MS Dhoni: సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి: ధోనీ
ఛేదనలో యూఎస్‌ఏ 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బంగ్లా బౌలర్లు చెలరేగడంతో యూఎస్‌ఏ 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మోనన్క్ పటేల్ (12), ఆండ్రైస్ గౌస్ (23), స్టీవెన్ టేలర్ (28), ఆరోన్ జేమ్స్ (4) వరుస విరామాల్లో పెవిలియన్‌కు చేరారు. ఈ సమయంలో ఆండర్సన్, హర్మీత్ సింగ్ బంగ్లాను ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా ఆడిన ఈ ఇద్దరు యూఎస్‌ఏను విజయతీరాలకు చేర్చారు. ముస్తాఫిజుర్ రెహమాన్ రెండు వికెట్స్ తీశాడు. మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానున్న వేళ ఈ విజయం యూఎస్‌ఏ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఆతిథ్య జట్టు హోదాలో యూఎస్‌ఏ ప్రపంచకప్ ఆడనుంది.
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?