Site icon NTV Telugu

Ajay Bhupathi : జయకృష్ణ కోసం ప్రత్యేక సెట్స్ – సాంగ్ షెడ్యూల్ రెడీ!

Jayakrishna Gamaneni

Jayakrishna Gamaneni

టాలీవుడ్‌లో మరో వారసుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి ‘మంగళవారం’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా కథా నేపథ్యం తిరుపతి పుణ్యక్షేత్రం చుట్టూ తిరుగుతుందని సమాచారం. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు స్వయంభుగా వెలసిన తిరుమల కొండల నేపథ్యంలో జరిగిన ఒక యదార్థ లేదా వైవిధ్యమైన సంఘటన ఆధారంగా అజయ్ భూపతి ఈ కథను సిద్ధం చేశారట. సినిమాలో ఎమోషనల్ డ్రామాతో పాటు కొత్త తరహా యాక్షన్ కూడా ఉండబోతుందని టాక్. కథ విన్నప్పుడే ఘట్టమనేని అభిమానులు ఈసారి ఒక సాలిడ్ వారసుడు రాబోతున్నాడని ఫిక్స్ అయిపోయారు.

Also Read : Kriti Sanon : బాక్సాఫీస్ నంబర్లు కాదు..పాత్రలే ముఖ్యం

కాగా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం తిరుపతి‌లో ప్రత్యేకమైన సెట్లను ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ అనంతరం, జయకృష్ణ‌పై ఒక గ్రాండ్ సాంగ్ షూట్ చేయబోతున్నారట. ఈ పాట కోసం కూడా మేకర్స్ ఎక్కడ వెనకాడకుండా భారీ సెట్టింగ్స్ వేయిస్తున్నారు. ఒక కొత్త హీరో పరిచయ చిత్రానికి ఉండాల్సిన అన్ని హంగులను అజయ్ భూపతి సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే, సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెకు కూడా ఇది తెలుగులో మొదటి సినిమా కావడంతో ఈ జంట‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నా ఈ మూవీతో జయకృష్ణ.. తాత కృష్ణ, బాబాయ్ మహేష్ బాబుల వారసత్వాన్ని ఏ రేంజ్‌లో ముందుకు తీసుకెళ్తారో చూడాలి!

Exit mobile version