Site icon NTV Telugu

Aishwarya Rajesh : డోర్ మూసేసి..బాడీ చూపించమన్నాడు..గతాన్ని గుర్తుచేసుకుని ఏడ్చేసిన ఐశ్వర్య రాజేష్!

Aishwarya Rajesh

Aishwarya Rajesh

టాలీవుడ్ లో తెలుగు అమ్మయిలరు సరైన గుర్తింపు దక్కడం లేదనే చర్చ ఎన్నటి నుండొ వింటున్నాం. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ తన కెరీర్ ప్రయాణం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత నటుడు రాజేష్ కుమార్తె అయిన ఐశ్వర్య, ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నప్పుడే రూ. 250 నుంచి రూ. 500 సంపాదన కోసం చిన్న చిన్న పనులు చేస్తూ తన తల్లికి అండగా నిలిచింది. కుటుంబంలో జరిగిన వరుస విషాదాలు, ఇద్దరు అన్నయ్యల మరణం తనను మానసికంగా ఎంతో కుంగదీశాయని ఆమె పేర్కొన్నారు. అయితే, సినిమాల్లోకి రాకముందు జరిగిన ఒక సంఘటన గురించి చెబుతూ ఐశ్వర్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్!

ఆమె యంగ్‌గా ఉన్నప్పుడు తన అన్నయ్యతో కలిసి ఒక ఫోటో షూట్‌కు వెళ్లారట. అక్కడ ఒక వ్యక్తి తన అన్నయ్యను బయట కూర్చోబెట్టి, డోర్ మూసేయమని చెప్పాడు. అనంతరం అత్యంత అసభ్యకరంగా మాట్లాడుతూ.. “రాత్రి వేళల్లో వేసుకునే సెక్సీ డ్రెస్సులు వేసుకుని నీ బాడీ చూపించు, నువ్వు ఏ డ్రెస్సులో ఎలా ఉంటావో చూడాలి” అని వేధించాడు. ఆ సమయంలో భయం వేసినా, ధైర్యం తెచ్చుకుని “మా అన్నయ్య పర్మిషన్ తీసుకుని వేసుకుంటాను” అని అక్కడి నుంచి తప్పించుకున్నానని ఆమె తెలిపారు. ఒకవేళ మరో రెండు నిమిషాలు అక్కడే ఉంటే తను చెప్పింది వినేదాన్నేమో అని, ఇలా ఎంతమంది అమ్మాయిలను మోసం చేసి ఉంటారోనని ఆమె ఆవేదన చెందారు. తెలుగులో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఆమె, అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నానని సంతోషం వ్యక్తం చేశారు.

Exit mobile version