Site icon NTV Telugu

Aishwarya Rai: ఒక్క పోస్టుతో అందరి నోళ్లు మూయించిన ఐశ్వర్య రాయ్!

Aishwarya Rai

Aishwarya Rai

Aishwarya Rai and Abhishek Bachchan celebrate 17th Wedding Anniversary: గత కొన్ని రోజులుగా ప్రపంచ సుందరి, బాలీవుడ్‌ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ పేరు తరచుగా వార్తల్లో వినిపిస్తోంది. బాలీవుడ్‌ నటుడు, భర్త అభిషేక్ బచ్చన్‌తో ఐష్‌ గొడవపడిందని.. విడాకులకు సిద్దయ్యారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే భర్త అభిషేక్ ఇంటి నుంచి వెళ్లి ఐశ్వర్య వేరుగా ఉంటున్నారని రూమర్లు వస్తున్నాయి. దీంతో ఐష్‌- అభిషేక్‌ నిజంగా విడిపోయారా?, విడాకులు తీసుకుంటున్నారా? అన్న ప్రశ్నలు అందరి మదిలో ఉన్నాయి. ఆ వార్తలన్నింటికీ ఐశ్వర్య ఒక్క పోస్టుతో చెక్ పెట్టారు.

నేడు ( ఏప్రిల్ 20) ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌ పెళ్లి రోజు. ఈ రోజు బాలీవుడ్ స్టార్‌ కపుల్స్ 17వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున ఐశ్వర్య రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో చేశారు. భర్త అభిషేక్, కూతురు ఆరాధ్యతో తాను కలిసున్న పిక్ షేర్ చేశారు. దానికి లవ్ సింబల్ జత చేశారు. అభిషేక్, ఐశ్వర్యకు ఫాన్స్ విషెస్ తెలుపుతున్నారు.

Also Read: Delhi Capitals: పొరపాటు చేశా.. ఢిల్లీ ఓటమి కారణం నేనే: రిషబ్ పంత్

ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌ 2007లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల సమ్మతితో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఐష్ వయస్సు 50 కాగా.. అభి వయస్సు 48. ఈ జంటకు 12 ఏళ్ల కూతురు ఆరాధ్య ఉంది. గతేడాది మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో ఐశ్వర్య మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’లో ఐష్ నటించనుందనే ప్రచారం జరుగుతోంది.

Exit mobile version